Share News

YS Sharmila: బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు.. షర్మిల

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:28 PM

వైఎస్సార్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి బానిస అని ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. గోద్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని మండిపడ్డారు. బీజేపీ అంటేనే గిట్టని వైఎస్సార్ కు బీజేపీకి బానిస అయిన జగన్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు.

YS Sharmila: బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు.. షర్మిల

వైఎస్సార్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి బానిస అని ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఫైర్ అయ్యారు. గోద్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని మండిపడ్డారు. బీజేపీ అంటేనే గిట్టని వైఎస్సార్ కు బీజేపీకి బానిస అయిన జగన్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు చేసిన జగన్ వారిని దారుణంగా మోసం చేశారని ఆక్షేపించారు. ఇమామ్ లకు రూ.15 వేలు వేతనం, ముస్లిం బ్యాంక్, చనిపోతే రూ.5 లక్షల బీమా వంటి ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే వాటిని విస్మరించారని ఆరోపించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరు ముస్లింల పక్షాన లేరన్న షర్మిల.. కాంగ్రెస్ మాత్రమే ముస్లింలకు భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు.

Trending: ధోనీ విజయం వెనక ఆమె.. ఎవరు, ఏం చేస్తున్నారో మీకు తెలుసా..


బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని వీళ్లు బానిసలు అయ్యారు. విభజన హామీలు ఒక్కటీ బీజేపీ నెరవేర్చలేదు, హోదాపై బీజేపీ మోసం చేసింది. వైఎస్సార్ బతికి ఉంటే కడప స్టీల్ ఎప్పుడో పూర్తి అయ్యేది. కడప స్టీల్ ను శంకుస్థాపన ప్రాజెక్ట్ గా మార్చారు. మూడు సార్లు శంకుస్థాపన చేసి ఎంపీలు నిద్రపోతున్నారు. ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్క రోజు కూడా కడప స్టీల్ గురించి మాట్లాడలేదు. కడప - బెంగళూర్ రైల్వే లైన్ వైఎస్సార్ ఆశయం. కానీ ఆ లైన్ ను జగన్ వద్దన్నారు.

- వైఎస్.షర్మిల, ఏపీసీసీ అధ్యక్షురాలు


PM Modi: కుటుంబ బంధనాల నుంచి దేశానికి విముక్తి కల్పించాం.. ప్రధాని మోదీ..

సీబీఐ నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి మళ్లీ ఎలా టిక్కెట్ ఇచ్చారని ప్రశ్నించారు. బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేరం చేయకపోతే విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారని ఆక్షేపించారు. హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వారికి బుద్ధి చెప్పాలని కోరారు. కడప ప్రజలకు అందుబాటులో ఉంటా.. వైఎస్సార్ లాగా సేవ చేస్తా అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 06 , 2024 | 01:27 PM