Share News

Trending: ధోనీ విజయం వెనక ఆమె.. ఎవరు, ఏం చేస్తున్నారో మీకు తెలుసా..

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:38 AM

ధోనీ.. ఈ పేరు తెలియని వారు ఉండరేమో. క్రికెట్ ( Cricket ) ప్రేమికులకే కాదు సాధారణ ప్రజానీకానికి సైతం ధోనీ పేరు సుపరిచితమే. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ లో సత్తా చూపిస్తూ కెప్టెన్సీలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందాడు.

Trending: ధోనీ విజయం వెనక ఆమె.. ఎవరు, ఏం చేస్తున్నారో మీకు తెలుసా..

ధోనీ.. ఈ పేరు తెలియని వారు ఉండరేమో. క్రికెట్ ( Cricket ) ప్రేమికులకే కాదు సాధారణ ప్రజానీకానికి సైతం ధోనీ పేరు సుపరిచితమే. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ లో సత్తా చూపిస్తూ కెప్టెన్సీలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందాడు. అందుకే ఆయనను ప్రేమగా మిస్టర్ కూల్ అని పిలుచుకుంటుంటారు. ఆటలో ఎంత ఒత్తిడి ఉన్నా ధోనీ మాత్రం ప్రశాంతంగా పని కానిచ్చేస్తుంటాడు. కష్ట కాలంలో జట్టును విజయ తీరాలకు నడిపించి ఎన్నో అవార్డులు అందించాడు. ఇన్ని విజయాలు సాధించడం వెనుక ధోనీ సోదరి పాత్ర ఎంతో ఉందనే విషయం చాలా మంది తెలియని విషయం.


ఎంఎస్. ధోనీ 2020లో ఐపీఎల్ మినహా అన్ని రకాల క్రికెట్‌ ఫార్మేట్ ల నుంచి రిటైర్ అయ్యాడు. మధ్య తరగతి కుటుంబం నుంచి కెరీర్ ను స్టార్ట్ చేసిన ధోనీ ప్రస్తుతం అత్యంత ధనిక క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. ధోనీ సాధించిన విజయాలు, అవార్డులు, పేరు ప్రఖ్యాతల వెనుక ఆయన సోదరి జయంతి గుప్తా సహకారం మరవలేనిది. తాను చేయలేనని ధోనీ అనుకునే సమయంలో అతని వెన్నంటే ఉండి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. క్రికెట్ పై తమ్ముడి ఇష్టాన్ని ప్రోత్సహించారు.

PM Modi: కుటుంబ బంధనాల నుంచి దేశానికి విముక్తి కల్పించాం.. ప్రధాని మోదీ..


జయంతి గుప్తా ఎంఎస్.ధోనీ కంటే 3 నుంచి 4 ఏళ్లు పెద్దవారు. ప్రస్తుతం ఆమె రాంచీలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ధోనీ స్నేహితుడైన గౌతమ్ గుప్తాను ఆమె వివాహం చేసుకున్నారు. ధోనీ కెరీర్ కు గౌతమ్ సైతం సహకారాలు అందించడం విశేషం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 06 , 2024 | 11:38 AM