Share News

AP Election 2024: చంద్రబాబుపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘం సీరియస్

ABN , Publish Date - Apr 07 , 2024 | 04:09 PM

ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి (CM Jagan)కి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనలపై జగన్‌కు ఎన్నికల సంఘం (Election Commission) నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా సమాధానం ఇవ్వలని ఈసీ ఆదేశించింది.

AP Election 2024: చంద్రబాబుపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘం సీరియస్

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి (CM Jagan)కి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనలపై జగన్‌కు ఎన్నికల సంఘం (Election Commission) నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.


BJP: ఏపీని డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా మార్చిన జగన్ ప్రభుత్వం: సాధినేని యామిని

ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేము సిద్ధం’ బస్సు యాత్రతో జగన్ ఎన్నికల ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.


AP Politics: బస్సు యాత్రలో జగన్‌కు ఝలక్.. ఎమ్మెల్యేల ట్విస్ట్ మామూలుగా లేదు..!

చంద్రబాబును అరుంధతి సినిమాలో పసుపతితో పోల్చుతూ సీఎం జగన్ వ్యగ్యంగా వ్యాఖ్యలు చేశారని ఈ తప్పుడు ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లే ప్రమాద ముందని సీఈఓ మీనాకు వివరించారు. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

అలాగే వలంటీర్లను విధులకు దూరం పెట్టడం వల్ల రెండు రోజుల్లోనే 31 మంది చనిపోయారని.. అందుకే చంద్రబాబును హంతకుడని జగన్ విమర్శించారు. జగన్ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ వ్యాఖ్యలపై సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు ఇచ్చింది. తమ నోటీసుకు 48 గంటల్లోగా సీఎం జగన్ సమాధానం ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.


TDP: పామర్రు, ఉయ్యూరులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలు

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 07 , 2024 | 05:34 PM