Share News

TDP: పామర్రు, ఉయ్యూరులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలు

ABN , Publish Date - Apr 07 , 2024 | 10:08 AM

అమరావతి: ప్రజాగళం యాత్రలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పామర్రు, ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

TDP:  పామర్రు, ఉయ్యూరులో చంద్రబాబు  రోడ్ షో, బహిరంగ సభలు

అమరావతి: ప్రజాగళం యాత్ర (Prajagalam Yatra)లో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆదివారం కృష్ణా జిల్లా (Krishna Dist.)లో పర్యటించనున్నారు. పామర్రు (Pamarru), ఉయ్యూరు (Uyyur)లో ఎన్నికల ప్రచారం (Election Campaign)లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు (TDP Leaders) చంద్రబాబు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మలి విడత యాత్రలో భాగంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు నిన్న పల్నాడు జిల్లాలో నిర్వహించిన ప్రజాగళం యాత్రలో పాల్గొన్నారు.

కృష్ణా జిల్లాలో చంద్రబాబు ప్రజా గళం పర్యటన షెడ్యూల్..

పామర్రు, ఉయ్యూరులో నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో, బహిరంగ సభలు ఉంటాయి. దీనికి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సత్తెనపల్లి నుంచి పామర్రు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో చంద్రబాబు వస్తారు. సాయంత్రం 4 గంటలకు పామర్రు మెయిన్ రోడ్డు మీదగా నాలుగు రోడ్ల జంక్షన్ వరకు రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు పామర్రు నుంచి రోడ్ మార్గం ద్వారా ఉయ్యూరుకు వెళతారు. 6 గంటల నుంచి 7: 30 గంటల వరకు ఉయ్యూరులో రోడ్డు షో, బహిరంగ సభ నిర్వహిస్తారు.

మరో రెండు నెలల్లో ప్రజాప్రభుత్వం..

కాగా మరో రెండు నెలల్లో ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలందరూ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించబోతున్నారని విజయవాడ పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు. కూటమి పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ అలియాస్‌ సుజనా చౌదరితో కలిసి శనివారం భవానీపురంలోని 40వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బ్యాంకు సెంటర్‌ వద్ద మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్‌మీరా, డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు పి.వి చిన్నసుబ్బయ్య, ఇతర నాయకులు వారికి ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాంధీబొమ్మ రోడ్డు, కోళ్లఫారం రోడ్డు, తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని భరోసా ఇచ్చారు. శివనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజాదరణ చాలా బాగుందన్నారు.

ఎన్‌టీఆర్‌ జిల్లా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ-బీజేపీ-జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారన్నారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పారు. తనపై కేశినేని నాని చేస్తున్న అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. విజయవాడ ఎంపీగా పదేళ్లు నాని ఉండడానికి కారణం సుజానాచౌదరి అన్నారు. కేశినేని నాని పశ్చిమ నియోజకవర్గంలో సీట్లు ఇప్పిస్తానని ఇద్దరు నాయకుల వద్ద డబ్బులు తీసుకున్నారని దీనిపై చర్చించడానికి రమ్మంటే సమాధానం చెప్పేందుకు ఇంతవరకు రాలేదన్నారు. కేశినేని నాని ఓ ఊసరవెల్లి, పెద్ద మీడియా పక్షి అని విమర్శించారు. సుజనా చౌదరి, చంద్రబాబునాయుడు, లోకేష్‌, పవన్‌కల్యాణ్‌లను విమర్శించే అర్హత కేశినేని నానికి లేదన్నారు. పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్‌ త్వరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్నారు. సుజానా చౌదరి మాట్లాడుతూ తాను, కేశినేని శివనాథ్‌ కలిసి డబుల్‌ ఇంజన్‌ పద్దతిలో పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రం సహాయంతో యువతకు మంచి భవిష్యత్తు అందించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

Updated Date - Apr 07 , 2024 | 10:51 AM