Share News

Lok Sabha Elections: భారీగా నగదు పట్టివేత

ABN , Publish Date - Apr 07 , 2024 | 02:02 PM

ఎన్నికల వేళ.. చెన్నై మహానగరంలో భారీగా నగదు పట్టుబడింది. తాంబరం రైల్వే స్టేషన్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా రూ. 4 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Lok Sabha Elections: భారీగా నగదు పట్టివేత

చెన్నై, ఏప్రిల్ 07: ఎన్నికల వేళ.. చెన్నై మహానగరంలో భారీగా నగదు పట్టుబడింది. తాంబరం రైల్వే స్టేషన్‌ ( Tambaram railway station)లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా రూ. 4 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చెంగల్‌పట్ పోలీసులు (Chengalpattu police) తెలిపిన వివరాల ప్రకారం... బీజేపీ నాయకుడు సతీష్ ఓ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతడు అతడి సోదరుడితోపాటు కారు డ్రైవర్‌తో కలిసి తిరునల్వేలి నుంచి రైలులో వచ్చారని తెలిపారు. మొత్తం ఆరు బ్యాగుల్లో ఈ నగదు మొత్తం సర్దారని చెప్పారు.

Arivind Kejriwal: ఆప్ నేతల నిరాహార దీక్ష

పోలీసు ప్లైయింగ్ స్కాడ్ తనిఖీల్లో ఈ నగదు పట్టుబడిందని చెప్పారు. ఇక తిరునల్వేలి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ( Tirunelveli BJP MP candidate) నైనార్ నగేందీరన్ (Nainar Nagenthiran) సూచనల మేరకు ఈ నగదు తీసుకు వచ్చినట్లు సతీష్ పోలీసుల ఎదుట అంగీకరించారు. అయితే ఈ నగదుకు సంబంధించి ఖచ్చితమైన రసీదులు వారు ఇవ్వ లేదు. దీంతో ఆ నగదు మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు పోలీసు అప్పగించారు.

Ayodhya: డిసెంబర్ నాటికి అచ్చెరువొందేలా అయోధ్య.. సమావేశంలో కీలక నిర్ణయాలు..

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తమిళనాడులో మొత్తం 39 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వాటికి ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మరిన్నీ జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 07 , 2024 | 02:41 PM