Share News

TDP: జగన్ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది: విజయ్ కుమార్

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:43 PM

అమరావతి: మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకునేవారు రాష్ట్రాన్ని బాగుచేసే వారికి ఓటు వేయాలని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడాలంటే మీ ఓటు హక్కుతోనే సాధ్యమని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు.

TDP: జగన్ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది:  విజయ్ కుమార్

అమరావతి: మొదటిసారి ఓటు హక్కు (Right to Vote)ను వినియోగించుకునేవారు రాష్ట్రాన్ని బాగుచేసే వారికి ఓటు వేయాలని, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) భవిష్యత్తు బాగుపడాలంటే మీ ఓటు హక్కుతోనే సాధ్యమని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ (Nilayapalem Vijay Kumar) అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియా (Media)తో మాట్లాడుతూ.. 2014 టీడీపీ (TDP) హయాంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారని, రాష్ట్రానికి అద్భుతాలు చేసి చూపించారని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)లో ఉద్యోగాలు లేక యువత ఎన్నో ఇబ్బందులు పడతున్నారని, వలస వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

2014-19 టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలు 60 ఏళ్లలో మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా రాలేదని, ప్రభుత్వాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిని బట్టే ప్రజల భవిష్యత్తు నిర్ణయించబడుతుందని నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి 100 పరిశ్రమలను తీసుకొచ్చిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో మొట్ట మొదటి సారిగా కియా కార్లను ప్రవేశపెట్టింది చంద్రబాబేనన్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు. చదువుకున్న యువతకు జాబు కావాలంటే బాబు రావాల్సిందేనని విజయ్ కుమార్ అన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 12:50 PM