Share News

Payyavula keshav: ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన

ABN , Publish Date - Dec 29 , 2024 | 09:12 PM

Payyavula keshav: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వం 93 కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేసిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 74 కేంద్ర ప్రభుత్వం పథకాలను రివైండ్ చేశామని తెలిపారు.

Payyavula keshav: ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
Payyavula keshav

కర్నూలు: కాంట్రాక్టు వ్యవస్థనే జగన్ ప్రభుత్వం చంపేసిందని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఏపీకి పది లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు. ప్రతి నిమిషానికి ఆర్ధిక పరిస్థితులు బేరీజు వేసుకుని పాలన చేయాల్సి వస్తోందని అన్నారు. ఏడు శాతం అప్పులు చేసి జీతాలు చెల్లిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి ఆదాయం ఇచ్చేది కాంట్రాక్టర్లే అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం 93 కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేసిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 74 కేంద్ర ప్రభుత్వం పథకాలను రివైండ్ చేశామని... త్వరలో మరికొన్ని చేస్తామని తెలిపారు. ఆర్సల్ మిట్టల్ కంపెనీ సీఎం చంద్రబాబును నమ్మి లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. పెద్ద పెద్ద కంపెనీలకే ఆర్ధిక శాఖ పేమెంట్‌లు చెల్లిస్తుందనే అపవాదు ఉందని చెప్పారు. ప్రియారిటీ ప్రకారం అన్ని కంపెనీలకు బిల్లులు చెల్లిస్తామని ప్రకటించారు. ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే 25 ఏళ్ల ఆదాయాన్ని జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు.


వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లను దోపిడీ దారులుగా చేసుకుందని విమర్శలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో కాంట్రాక్టర్లను భాగస్వాములుగా చేస్తుందని అన్నారు. దీపావళి పండుగకు కొంతమంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పంచాయతీ నిధులను వైసీపీ ప్రభుత్వం కాజేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పంచాయతీలకే కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.


జగన్ ప్రభుత్వం నాపై కక్షగట్టింది: ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు

vishnu-jagan.jpg

జగన్ ప్రభుత్వంలో బిల్లులు రాక అప్పుల పాలై 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఓ కాంట్రాక్టర్‌నని.. తనకు జగన్ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా తనపై కక్షగట్టిందని చెప్పారు. గత ఐదేళ్లలో జగన్ దుర్మార్గపు పాలన చేశారని ఆరోపించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తాను పలు పనులు చేశానని గుర్తుచేశారు. చంద్రబాబు హయంలో వర్క్స్ చేశారు కాబట్టి ఆయన్నే బిల్లులు అడగాలని వైసీపీ పెద్దలు తనను హీనంగా మాట్లాడారని వాపోయారు. పార్టీ మారితే బిల్లులు మంజూరు చేస్తామని వైసీపీ పెద్దలు తనపై వత్తిడి చేశారన్నారు. అయినా తాను పార్టీ మారలేదని చెప్పారు. జగన్ ప్రభుత్వం మంజూరు చేయకున్నా వర్క్స్ పూర్తి చేశానని తెలిపారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి మాటలు నమ్మి కొంతమంది కాంట్రాక్టర్లు వైసీపీలో చేరారని.. వారికి నేటికీ వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Amaravati: జగన్ నిర్వాకంతో నీటిలోనే నానుతున్న ర్యాప్ట్ ఫౌండేషన్

Deputy CM Pawan Kalyan : తోలుతీసి కూర్చోబెడతాం

JC Prabhakar Reddy: వీపు విమానంమోతమోగిస్తా.. మాజీ మంత్రికి జేసీ వార్నింగ్

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 29 , 2024 | 09:27 PM