Share News

YSRCP: అనకాపల్లి ఎంపీ సీటు.. ప్లేటు తిప్పేసిన జగన్.. ఆ అభ్యర్థికి పెద్ద షాక్?

ABN , Publish Date - Apr 22 , 2024 | 06:28 PM

ఈసారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్న సీఎం వైఎస్ జగన్.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రకరకాల వ్యూహాలు, ఫార్మాలాలను అనుసరిస్తున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థుల బలాబలాల్ని దృష్టిలో ఉంచుకొని..

YSRCP: అనకాపల్లి ఎంపీ సీటు.. ప్లేటు తిప్పేసిన జగన్.. ఆ అభ్యర్థికి పెద్ద షాక్?
YCP Planning To Change Anakapalle MP Candidate

అమరావతి: ఈసారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్న సీఎం వైఎస్ జగన్ (YS Jagan).. ఎన్నికలు (AP Elections 2014) సమీపిస్తున్న తరుణంలో రకరకాల వ్యూహాలు, ఫార్మాలాలను అనుసరిస్తున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి (TDP-Janasena-BJP Alliance) అభ్యర్థుల బలాబలాల్ని దృష్టిలో ఉంచుకొని.. వారికి ధీటుగా పోటీనిచ్చే బలమైన నేతల్ని ఎంపిక చేసేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చేసిన జగన్.. ఇప్పుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బుడి ముత్యాలనాయుడిని (Budi Mutyala Naidu) ఎంపిక చేసిన వైసీపీ (YCP).. ఇప్పుడు ఆయన్ను తొలగించి, ఇటీవలే అధికార పార్టీలో చేరిన ఆడారి కిషోర్‌ కుమార్‌ని (Adari Kishore Kumar) రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ మార్పు వెనుక ఓ బలమైన కారణం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


షాకింగ్ ఘటన.. కంట్లో కారం కొట్టి, పెళ్లికూతురిని ఈడ్చుకెళ్తూ..

అదేమిటంటే.. అనకాపల్లి స్థానం నుంచి ఎంపీ ఎన్నికల బరిలో టీడీపీ కూటమి తరఫున సీఎం రమేష్ (CM Ramesh) బరిలోకి దిగారు. ఆయన బలమైన అభ్యర్థి కావడంతో.. ముత్యాలనాయుడు ఆయన్ను ముందు తేలిపోతారని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. జగన్ మరో వ్యూహానికి తెరలేపారు. టీడీపీలో తనకు సరైన గుర్తింపు దక్కలేదని ఆరోపణలు చేస్తూ వైసీపీలో చేరిన ఆడారి కిశోర్‌కు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్ యోచిస్తున్నారట. ఇప్పటికే జగన్ నుంచి ఆయనకు టికెట్ కన్ఫమ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న తరుణంలో అభ్యర్థుల్ని మారుస్తున్న జగన్.. అందులో భాగంగానే అనకాపల్లి విషయంలో ఈ మార్పు చేయబోతున్నట్టు తెలుస్తోంది. బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన కిషోర్‌కి సామాజికంగా, రాజకీయంగా మంచి పట్టు ఉండటంతోనే.. ముత్యాలనాయుడి స్థానంలో ఆయన్ను ఎంపీగా దింపుతున్నారని సమాచారం. ఇదే నిజమైతే.. ముత్యాలనాయుడికి జగన్ పెద్ద హ్యాండ్ ఇచ్చినట్టే.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Apr 22 , 2024 | 06:29 PM