Share News

Bride Kidnap: షాకింగ్ ఘటన.. కంట్లో కారం కొట్టి, పెళ్లికూతురిని ఈడ్చుకెళ్తూ..

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:00 PM

పెళ్లి జరుగుతున్న సమయంలో కొందరు మండపంలోకి దూసుకురావడం, పీటలపై ఉన్న పెళ్లికూతురిని కిడ్నాప్ చేయడం వంటి సంఘటనలు సినిమాల్లో చాలానే చూశాం. ఇప్పుడు నిజ జీవితంలోనే అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మండపంలోకి కొందరు దుండగులు దూరి..

Bride Kidnap: షాకింగ్ ఘటన.. కంట్లో కారం కొట్టి, పెళ్లికూతురిని ఈడ్చుకెళ్తూ..
Thugs Tried To Kidnap Bride

పెళ్లి జరుగుతున్న సమయంలో కొందరు మండపంలోకి దూసుకురావడం, పీటలపై ఉన్న పెళ్లికూతురిని కిడ్నాప్ చేయడం వంటి సంఘటనలు సినిమాల్లో (Movies) చాలానే చూశాం. ఇప్పుడు నిజ జీవితంలోనే అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మండపంలోకి కొందరు దుండగులు దూరి.. పెళ్లి పెద్దలు, బంధుమిత్రుల కళ్లపై కారం చల్లి.. పెళ్లికూతురిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


శ్రీకాళహస్తిలో సీన్‌ రివర్స్‌.. మధుసూదన్‌రెడ్డికి ఎదురుగాలి

రాజమండ్రి రూరల్ కడియంలో ఒక పెళ్లి ఘనంగా జరుగుతోంది. బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక కాసేపట్లోనే పెళ్లి జరగబోతుందనగా.. కొందరు దుండగులు ఒక్కసారిగా మండపంలోకి దూరారు. మొదట్లో ప్రేమగా మాట్లాడుతూ లోనికి వచ్చారు. సరిగ్గా పీటల దగ్గరికి చేరుకున్నాక ఆ దుండగులు ఒక్కసారిగా చెలరేగిపోయారు. అమ్మాయి కుటుంబ సభ్యులతో పాటు చుట్టూ ఉన్న బంధుమిత్రులు, అతిథుల కళ్లపై కారం చల్లారు. అక్కడి నుంచి పెళ్లికూతురిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే.. అమ్మాయి తరఫు వ్యక్తులు కూడా గట్టిగానే ప్రతిఘటించారు. అమ్మాయిని తీసుకెళ్లనివ్వకుండా వారిని అడ్డుకున్నారు. ఆ దుండగుల నుంచి ఆమెని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటికీ ఆగని దుండగులు.. తమకు అడ్డుగా వస్తున్న వాళ్లపై కంట్లో కారం కొడుతూ కనిపించారు.

వెలుగొండ పూర్తి చేయకుండా ఇన్నాళ్లు గాడిదలు కాశారా? .. షర్మిల ఫైర్

అయితే.. ఆ దుండగులు అమ్మాయిని తీసుకెళ్లారా? లేదా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే.. పెళ్లికూతురిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఆ దుండగులు ఎవరు? అసలు ఎందుకు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు? అనే డీటెయిల్స్ కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. బహుశా.. ఈ కిడ్నాప్ యత్నం వెనుక ‘ప్రేమ’ వ్యవహారం ఉండొచ్చేమోనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Apr 22 , 2024 | 05:12 PM