Share News

ABN BIG Debate: నా రాజకీయం వేరు.. నేను వచ్చాక వైసీపీ అభ్యర్థినే మార్చా..

ABN , Publish Date - Apr 24 , 2024 | 08:07 PM

నీతి, నిజాయితీతో కూడిన రాజకీయం చేయడానికే పాలిటిక్స్‌లోకి వచ్చానని తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కొత్త తరం రాజకీయం ఏమిటో చూపిస్తానన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, అసభ్య పదజాలాన్ని ఉపయోగించలేదన్నారు. గతంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించేవారని, తాను మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత.. ఆయన బూతులు మాట్లాడకుండా మార్చగలిగానని చెప్పారు.

ABN BIG Debate: నా రాజకీయం వేరు.. నేను వచ్చాక వైసీపీ అభ్యర్థినే మార్చా..

నీతి, నిజాయితీతో కూడిన రాజకీయం చేయడానికే పాలిటిక్స్‌లోకి వచ్చానని తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కొత్త తరం రాజకీయం ఏమిటో చూపిస్తానన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, అసభ్య పదజాలాన్ని ఉపయోగించలేదన్నారు. గతంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించేవారని, తాను మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత.. ఆయన బూతులు మాట్లాడకుండా మార్చగలిగానని చెప్పారు. సంకల్పం ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. తాను గెలుపోటములతో సంబంధం లేకుండా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండేందుకే వచ్చానన్నారు.

AP High Court: ఎన్నికల వేళ.. వైసీపీకి మళ్లీ దెబ్బ


మెజార్టీ ఎంతంటే..

కనీసం లక్ష 50 వేల మెజార్టీతో తాను ఎంపీగా గెలవబోతున్నానని పెమ్మసాని చంద్రశేఖర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ ఓడినా రాజకీయాల్లో ఉంటానన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడమే తన లక్ష్యమన్నారు. సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించడమే తన ముందున్న ఏకైక అజెండా అన్నారు. ఎంపీలతో సమన్వయం చేసుకుని పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.


Yarlagadda Venkatarao: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest Andhra Pradesh News And Telugu News

Updated Date - Apr 24 , 2024 | 09:40 PM