Share News

Chandrababu: ఆడబిడ్డలను ప్రపంచంలోనే శక్తివంతులుగా చేసే బాధ్యత నాది..

ABN , Publish Date - Apr 20 , 2024 | 02:12 PM

Andhrapradesh: మహిళలు వారి కుటుంబాలకు ఆర్ధిక మంత్రిలా ఉండేలా చేశానని... డ్వాక్రా గ్రూపులు పెట్టించి ఆర్ధికంగా ముందుకు తీసుకెళ్లామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం జిల్లాలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అధినేత మాట్లాడుతూ.. మహిళలకు 33 శాతం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చామన్నారు. ఇవాళ ఆడపిల్లలకే ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి తెచ్చామని.. మగబిడ్డల కంటే ఆడబిడ్డలే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారన్నారు.

Chandrababu: ఆడబిడ్డలను ప్రపంచంలోనే శక్తివంతులుగా చేసే బాధ్యత నాది..
DP Chief Chandrababu interact with womens

నెల్లూరు, ఏప్రిల్ 20: మహిళలు వారి కుటుంబాలకి ఆర్ధిక మంత్రిలా ఉండేలా చేశానని... డ్వాక్రా గ్రూపులు పెట్టించి ఆర్ధికంగా ముందుకు తీసుకెళ్లామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu) అన్నారు. శనివారం జిల్లాలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అధినేత మాట్లాడుతూ.. మహిళలకు 33 శాతం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చామన్నారు. ఇవాళ ఆడపిల్లలకే ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి తెచ్చామని.. మగబిడ్డల కంటే ఆడబిడ్డలే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారన్నారు. దీపం పథకం పెట్టి అందరికీ వంట గ్యాసు ఇచ్చామని తెలిపారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలని మరుగుదొడ్లు కట్టించామని గుర్తుచేశారు. సమాజంలో మగ, ఆడ అనే తేడా లేదని.. మగవాళ్లకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తే... ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుందని చెప్పారు.

AP Elections: నెల ముందే జీతం.. అదనంగా డబుల్ బోనస్.. వాలంటీర్ల రాజీనామా వెనుక అసలు కథ..


ఆడబిడ్డలకు తెలుగుదేశం పార్టీ పుట్టిల్లు అని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని.. ఎన్డీఏ మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వబోతుందని హామీ ఇచ్చారు. ఆడబిడ్డలని ప్రపంచంలోనే శక్తివంతులుగా చేసే బాధ్యత తనది అని స్పష్టం చేశారు. జగన్ పొట్టనిండా అబద్దాలే అని... నోటి నిండా అబద్దాలే అని విరుచుకుుపడ్డారు. జనానికి ఇచ్చిన దానికంటే దోచేది ఎక్కువ అని ఆరోపించారు. బటన్ నొక్కి బొక్కింది ఎంత? దొబ్బేసింది ఎంత? జగన్ ఓ అసమర్ధుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. కొండలని మాయం చేశారని... ఖనిజ సంపదనీ దోచేశారని ఆరోపించారు.

AP Politics: అడ్డంగా బుక్కైన వైసీపీ నేతలు.. ఆఫీస్ నిండా అవే..


అధికారంలోకి వచ్చాక అందరికీ ఇళ్లు ఇస్తామని.. రెండు సెంట్లు లెక్కన స్థలమిచ్చి ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ‘‘నేను సీఎం అయిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలు మీదే మొదటి సంతకం‌ చేస్తా’’ అని చెప్పారు. రైతుకూలీలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని.. ఏడాదికి ప్రతి రైతు కూలి కుటుంబానికి రూ.20వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. దిశ చట్టం ఉందా? కనీసం నిర్భయ చట్టం ద్వారా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


నా పూర్వజన్మసుకృతం...

‘‘మీ అందరి మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం నా పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నా. ప్రపంచంలోనే తెలుగుజాతి నెంబర్ వన్‌గా ఉండాలనేది నా లక్ష్యం. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని చేయాలనేదే నా జీవిత లక్ష్యం. పేదరికంలేని సమాజాన్ని చూడాలన్నదే నా ఆశయం. జగన్ రెడ్డి కాదు... జ"గన్" రెడ్డి. మద్యం, మద్యం షాపులూ ఆయనవే. భూముల మీద హక్కులూ ఆయనవే. సంపద సృష్టించడం చాలా తేలిక. ఇప్పుడు ఆ సంపదంతా కొందరే దోచుకుంటున్నారు. మహిళలలో బ్రహ్మాండమైన చైతన్యం ఉంది. ఆడబిడ్డలను చదివించాలని ఎన్టీఆర్ భావించారు. పద్మావతి యూనివర్శిటీ ఏర్పాటు చేశారు. ఆస్థిలో సమానహక్కు కల్పించారు. మగవారితో సమానంగా మహిళలూ రాజకీయాల్లో రాణించాలి. చట్టసభల్లో కూడా మహిళలు ఉండాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Lok Sabha Polls 2024: ఓటర్లకు అలర్ట్.. ఆ పని చేయొద్దని సీజేఐ చంద్రచూడ్ సూచన


ఇవి కూడా చదవండి...

AP Elections: జగన్ గాలి తీసేసిన యువత.. ఆ సీన్ చూసి వైసీపీ మైండ్ బ్లాంక్

YSRCP: అవనిగడ్డలో వైసీపీకి భారీ షాక్..

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 20 , 2024 | 02:18 PM