Share News

CM Ramesh: సీఎం రమేష్ నోట ఆర్ఆర్ఆర్ ఆస్కార్ మాట.. అమిత్ షాకు చెప్పి మరీ..

ABN , Publish Date - Apr 22 , 2024 | 08:01 PM

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ‘ఆస్కార్ అవార్డ్’ వచ్చిన తర్వాత రామ్ చరణ్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సన్మానించిన విషయం అందరికీ తెలిసిందే. చరణ్ తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో..

CM Ramesh: సీఎం రమేష్ నోట ఆర్ఆర్ఆర్ ఆస్కార్ మాట.. అమిత్ షాకు చెప్పి మరీ..
CM Ramesh Shares Interesting Topic About Amit Shah Ram Charan Meeting

దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాకు ‘ఆస్కార్ అవార్డ్’ (Oscar Award) వచ్చిన తర్వాత రామ్ చరణ్‌ను (Ram Charan) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సన్మానించిన విషయం అందరికీ తెలిసిందే. చరణ్ తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) కలిసి ఢిల్లీలో ఓ హోటల్‌లో ఉన్నప్పుడు.. స్వయంగా అమిత్ షా అక్కడికి చేరుకొని, చరణ్‌ని సన్మానించారు. అనంతరం ఇద్దరితో కలిసి కాసేపు ముచ్చటించారు.


ఖాతా తెరిచిన బీజేపీ.. ఎన్నికలు అవ్వకుండానే అభ్యర్థి గెలుపు.. అదెలాగంటే?

ఈ మీటింగ్‌పై తాజాగా అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తాను అమిత్‌షాకు చెప్పి, చరణ్‌ని సన్మానించేలా చేశానని చెప్పారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో (Andhrajyothy MD Radha Krishna) జరిగిన ‘బిగ్ డిబేట్’లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో అంత సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది? మీకు మద్దతుగా వీడియో ఎందుకు చేశారు? అని ప్రశ్నలు సంధించినప్పుడు.. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రస్తావనని రమేష్ తీసుకొచ్చాడు. తాను, చిరంజీవి ఒకేసారి రాజ్యసభకు ఎన్నికయ్యామని.. అప్పటి నుంచి ఆయనతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని అన్నారు. దీనికితోడు.. అమిత్‌షాని కోరి, రామ్‌చరణ్‌ని సత్కరించేలా చేసినందుకు చిరంజీవికి తనపై మరింత మంచి ఇంప్రెషన్ ఏర్పడిందని వెల్లడించారు.

అనకాపల్లి ఎంపీ సీటు.. ప్లేటు తిప్పేసిన జగన్.. ఆ అభ్యర్థికి పెద్ద షాక్?

ఈ ఇంటర్వ్యూలో సీఎం రమేష్ మాట్లాడుతూ.. ‘‘ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ వచ్చినప్పుడు రామ్ చరణ్ ఢిల్లీకి వచ్చాడు. అప్పుడు నేను అమిత్‌షా వద్దకు వెళ్లి, అతడ్ని సన్మానించాలని కోరాను. మెగాస్టార్ చిరంజీవి తనయుడు కావడంతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎంతో చక్కగా నటించాడని చెప్పి.. అతడ్ని సన్మానించాల్సిందేనని అమిత్‌షా తనతో చెప్పారన్నారు. అప్పుడు చరణ్, చిరంజీవి ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఉన్నారని.. అక్కడికే వెళ్లి సన్మానిస్తే బాగుంటుందని నేను చెప్పాను. అందుకు అమిత్‌షా సరేనని చెప్పి.. వాళ్లున్న హోటల్‌కే వెళ్లి.. చరణ్‌ని సత్కరించారు’’ అని చెప్పుకొచ్చారు. స్వయంగా అమిత్ షా వచ్చి సత్కరించడంతో చిరంజీవి ఉప్పొంగిపోయారన్నారు. తాను ఎంపీగా గెలవాలని చిరు ఆశించారని, అందుకే తనకు మద్దతు తెలిపారని చెప్పుకొచ్చారు.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Apr 22 , 2024 | 08:01 PM