Share News

CM Ramesh: వివేకా హత్య కేసులో జగన్, భారతి ప్రమేయం ఉంది

ABN , Publish Date - Apr 22 , 2024 | 09:00 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేముల రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా.. వైఎస్ వివేకా హత్య కేసుపై అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య కేసులో ఏపీ సీఎం జగన్, భారతి ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు.

CM Ramesh: వివేకా హత్య కేసులో జగన్, భారతి ప్రమేయం ఉంది
CM Ramesh Sensational Comments On YS Jagan Over YS Viveka Case

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేముల రాధాకృష్ణతో (Vemula Radha Krishna) జరిగిన బిగ్ డిబేట్‌లో భాగంగా.. వైఎస్ వివేకా హత్య కేసుపై (YS Viveka Case) అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య కేసులో ఏపీ సీఎం జగన్ (YS Jagan), భారతి (YS Bharati) ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. అసలు వాళ్ల అనుమతి లేకుండానే జరుగుతుందా? అని ప్రశ్నించారు. వివేకా హత్యలో జగన్ దంపతుల ప్రమేయం ఉందని ప్రజలకు కూడా తెలుసని పేర్కొన్నారు. ఈ కేసులో ముద్దాయి అని అవినాష్ రెడ్డి తప్పకుండా అరెస్ట్ అవుతాడని జోస్యం చెప్పారు.


అనకాపల్లి ఎంపీ సీటు.. ప్లేటు తిప్పేసిన జగన్.. ఆ అభ్యర్థికి పెద్ద షాక్?

వైసీపీ (YCP) ఏ తప్పు చేసినా.. కేంద్రానికి చెప్పే చేశామని అబద్ధాలు చెప్తోందని.. ఈ విషయాన్ని తాను తమ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లానని సీఎం రమేష్ చెప్పారు. అందుకే తమ పార్టీ పెద్దలు జగన్ అవినీతిని ఎండగట్టారని అన్నారు. అవినాష్ రెడ్డికి (Avinash Reddy) వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని అమిత్ షా తనకు చెప్పారని.. ఈ విషయం తనకు ఏడాదిన్నర క్రితమే చెప్పడం జరిగిందని, ఆయనకు అన్ని విషయాలు తెలుసని వెల్లడించారు. సమయం వచ్చినప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమన్నారు. షర్మిల (YS Sharmila), సునీత (YS Sunitha) వల్ల జగన్‌కు నష్టం జరగడం ఖాయమని.. వాళ్లు చెప్తున్న మాటల్ని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు నమ్ముతున్నారన్నారు. ఆస్తుల కోసమే వివేకాను సునీతను చంపిందని వైసీపీ వాళ్లు చెప్పడం ఘోరమని మండిపడ్డారు. అధికారం శాశ్వతమని జగన్ అనుకుంటున్నారని.. ప్రజలు ఏదీ మర్చిపోరని నొక్కి చెప్పారు. బీజేపీలో ప్రధాని మోదీ (PM Narendra Modi), అమిత్‌షాలను ఎవరూ ప్రభావితం చేయలేరని తేల్చి చెప్పారు.


సీఎం రమేష్ నోట ఆర్ఆర్ఆర్ ఆస్కార్ మాట.. అమిత్ షాకు చెప్పి మరీ..

కొంతకాలం క్రితం దక్షిణ భారత ఎంపీలకు మోదీ డిన్నర్ ఏర్పాటు చేశారని.. అక్కడ ప్లే చేసిన ఓ వీడియోలో జగన్‌ అరాచకాలు, అవినీతిని చూపించారని సీఎం రమేష్ కుండబద్దలు కొట్టారు. జగన్‌ దగ్గర బ్లాక్‌ మనీ ఎలా ఉందో చూపించారని.. అలాగే ఇసుక, మైనింగ్‌, లిక్కర్‌, కబ్జాలు, ఇతర అరాచకాల్ని చూపించడం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు.. జగన్‌ ఎలా స్టిక్కర్‌ వేసుకుంటున్నారో కూడా వాళ్లకు తెలుసన్నారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిందని మీడియాలో రావడం వల్లే.. రాయి దాడి ఘటనపై జగన్‌కి మద్దతుగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారని.. అదంతా మోసమని తాము మళ్లీ మోదీకి చెప్పారని తెలిపారు. జగన్ దుర్మార్గుడు, రాక్షసుడు అని ప్రధాని మోదీ అనుకుంటున్నారని.. అందుకే చిలకలూరిపేట మీటింగ్‌లో జగన్ పేరెత్తడానికి ఆయన ఇష్టపడలేదని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో జగన్‌పై చాలా వ్యతిరేకత ఉందని, ఆయన్ను గద్దె దించాలన్న కసి ప్రజల్లో ఉందని సీఎం రమేష్ చెప్పుకొచ్చారు.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Apr 22 , 2024 | 09:00 PM