Share News

BIG Debate: టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సూపర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

ABN , Publish Date - May 08 , 2024 | 11:54 AM

ఏపీలో ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజులు సమయం మాత్రమే ఉంది. గెలుపు మాదేనంటూ ఎన్డీయే కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. వికసిత ఆంధ్రప్రదేశ్ నినాదంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు.. మరోవైపు అధికార వైసీపీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతం టార్గెట్ చేస్తోంది. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలో ఎన్డీయే కూటమి విజయవకాశాలు ఎలా ఉన్నాయి. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం వలన తెలుగుదేశం, జనసేన జోడికి లాభమా.. నష్టమా..

BIG Debate: టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సూపర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
RK Big Debate With Chandrababu

ఏపీలో ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజులు సమయం మాత్రమే ఉంది. గెలుపు మాదేనంటూ ఎన్డీయే కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. వికసిత ఆంధ్రప్రదేశ్ నినాదంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు.. మరోవైపు అధికార వైసీపీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోంది. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలో ఎన్డీయే కూటమి విజయవకాశాలు ఎలా ఉన్నాయి. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం వలన తెలుగుదేశం, జనసేన జోడికి లాభమా.. నష్టమా..

AP Elections: నెల్లూరులో వైసీపీ ఎదురీత.. కంచుకోట కూలుతోందా..!?


జగన్ పతనం.. ఎన్డీయే విజయం తధ్యమని చంద్రబాబు అంత నమ్మకంగా ఎలా చెబుతున్నారు.. జగన్మోహన్ రెడ్డి కుట్రలు, మాయలను తిప్పికొట్టగల అస్త్రాలు చంద్రబాబు దగ్గర ఉన్నాయా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల్లో జగన్ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తుందా.. జగన్ ఏలుబడిలో ధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టే యాక్షన్ ప్లాన్ బాబు దగ్గర ఉందా.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడితే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుంది. కేంద్రంలో మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతారా.. అన్ని మంచి శకునాలే అని ధీమాగా ఉన్న చంద్రబాబును ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధమేనా..! ఇలా ఎన్నో ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెప్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈరోజు రాత్రి 8గంటలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక‌ృష్ణ బిగ్ డిబేట్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. మిస్ కాకుండా చూడండి.. ఈరోజు రాత్రి 8 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక‌ృష్ణ సూపర్ ఎక్స్‌క్లూజివ్ బిగ్ డిబేట్.. డోంట్ మిస్..


YSRCP: అర్ధరాత్రి కవ్వింపు చర్యలు.. టీడీపీ నేతలపై వైసీపీ మూకల దాడి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2024 | 02:41 PM