Share News

Tirumala: టీటీడీ పాలకమండలి తాజా నిర్ణయాలు ఇవే...

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:13 PM

Andhrapradesh: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సోమవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

Tirumala: టీటీడీ పాలకమండలి తాజా నిర్ణయాలు ఇవే...

తిరుమల, మార్చి 11: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (TTD) సోమవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (TTD Chairman Bhumana Karunakar Reddy) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. టీటీడీలోని అన్ని కళాశాలల్లో సిఫారస్సు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం అదనంగా భవనాలు నిర్మించాలని నిర్ణయించింది.

AP Politics: రెండ్రోజుల్లో టీడీపీలోకి వైసీపీ ఎంపీ..


మరిన్ని టీటీడీ నిర్ణయాలు...

  • 2014వ సంవత్సరానికి ముందు టీటీడీలో నియమింపబడిన కాంట్రాక్టు, పొరుగు సేవా సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వానికి సిఫారస్సు.

  • యాత్రి సముదాయంలో లిఫ్ట్‌ల ఏర్పాటుకు 1.88 కోట్లు..

  • బాలాజినగర్ సమీపంలో ఫెన్సింగ్ ఏర్పాటుకు నిర్ణయం..

  • రూ.14 కోట్లతో టీటీడీలోని 188 క్వార్టర్స్ ఆధునికరణ..

  • గోవిందరాజ స్వామి ఆలయంలో బాష్యాకర్ల సన్నిధిలో మకరతోరణం ఏర్పాటుకు ఆమోదం..

  • ఐటీ సేవల కొసం 12కోట్ల నిధులు మంజూరు..

  • శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీలోని పురాతన ఆలయాల మరమ్మతులకు ఆమోదం..

  • రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీవారి ఆలయ ఉద్యోగి నరసింహన్ కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు.

ఇవి కూడా చదవండి...

YSRCP: చిత్తూరు వైసీపీలో ముసలం ప్రారంభం

INDIA Bloc: విచ్ఛిన్నమవుతున్న ఇండియా కూటమి.. తాజాగా మరో పార్టీ దూరం


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 11 , 2024 | 12:53 PM