Viral Video: ఈ యువతి ఫార్మా కంపెనీలో ఓ ఉద్యోగి.. రోడ్డు పక్కన ఓ స్టాల్‌ను పెట్టి రోజూ రాత్రిళ్లు ఏం చేస్తోందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-09-23T19:49:51+05:30 IST

కొందరు కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వివిధ రకాల ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే వారి అభిరుచి మాత్రం వేరే ఉంటుంది. అయినా చాలా మంది దానిని పక్కన పెట్టి ఉద్యోగాలు చేసేందుకే మొగ్గుచూపుతుంటారు. కొందరు మాత్రం చివరకు ఎలాగైనా వారు అనుకున్నది చేసేస్తుంటారు. ఇలాంటి...

Viral Video: ఈ యువతి ఫార్మా కంపెనీలో ఓ ఉద్యోగి.. రోడ్డు పక్కన ఓ స్టాల్‌ను పెట్టి రోజూ రాత్రిళ్లు ఏం చేస్తోందో మీరే చూడండి..!

కొందరు కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వివిధ రకాల ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే వారి అభిరుచి మాత్రం వేరే ఉంటుంది. అయినా చాలా మంది దానిని పక్కన పెట్టి ఉద్యోగాలు చేసేందుకే మొగ్గుచూపుతుంటారు. కొందరు మాత్రం చివరకు ఎలాగైనా వారు అనుకున్నది చేసేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫార్మా కంపెనీలో పని చేసే యువతి.. రాత్రి వేళల్లో రోడ్డు పక్కన స్టాల్ నిర్వహిస్తోంది. ఇంతకీ ఈమె ఏం చేస్తోందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ యువతి (Ahmedabad young woman) స్థానికంగా ఉన్న ఫార్మా కంపెనీలో పని చేస్తుంటుంది. అయితే ఆమెకు స్థానికంగా ఫేమస్ అయిన పాస్తా (pasta) వంటకానికి సంబంధించిన స్టాల్ నిర్వహించాలనేది ఆశయం. అయితే ఉద్యోగం వల్ల ఇన్నాళ్లూ అది సాధ్యం కాలేదు. అయితే కొన్ని నెలల క్రితం ఆమె తన అభిరుచిని ఆచరణలోకి తీసుకొచ్చింది. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. రాత్రి వేళ ఫుడ్ స్టాల్ (Road side food stall) నిర్వహించాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగింది.

Viral Video: చిప్ప్ తినే అలవాటు మీకు ఉందా..? అసలు వాటిని ఎలా తయారు చేస్తారో ఒక్కసారైనా చూశారా..?

ఉద్యోగం పూర్తయిన తర్వాత ఇంటి నుంచి పాస్తా తయారీకి కావాల్సిన వస్తువులతో జనాలు ఎక్కువగా ఉండే రోడ్డు పక్కకు చేరుకుంది. వివిధ రకాల వస్తువులను కలిపేసి చివరకు మాకరోని పాస్తా వంటకాన్ని సిద్ధం చేసింది. చివరగా దాన్ని గ్యాస్ పైపు నుంచి వచ్చే మంటతో వేడి చేసి.. కస్టమర్లకు అందించింది. ఈ పాస్తా రుచికరంగా ఉండడంతో జనం ఈ యువతి స్టాల్ వద్దకు క్యూ కడుతున్నారు. కొందరు ఈమె స్టాల్‌ను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! చూస్తుంటేనే నోరూరుతోంది’’.. అని కొందరు, ‘‘ఈ యువతి టాలెంట్ సూపర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Lions vs Buffalo: సింహాల గుంపు ఓ వైపు.. దున్నపోతుల గుంపు మరో వైపు.. అడవిలో బిగ్ ఫైటింగ్.. చివరకు..!

Updated Date - 2023-09-23T19:49:51+05:30 IST