Zomato: జొమాటో యూజర్లకు ఇంపార్టెంట్ అలెర్ట్.. కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ గురించి తెలుసా..? ఇకపై వీళ్లకు కూడా..!

ABN , First Publish Date - 2023-09-22T18:08:01+05:30 IST

ఆకలేస్తే పొయ్యి వెలిగించాల్సిన పని లేకుండా.. స్మార్ట్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే.. సమయంతో సంబంధం లేకుండా కోరుకున్న ఆహార పదార్థాలన్నీ వేడి వేడిగా ఇంటికి క్యూకట్టే రోజులివి. దీంతో ఎక్కువ శాతం యువత.. స్వయంపాకానికి స్వస్తి చెబుతూ స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌లనే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం..

Zomato: జొమాటో యూజర్లకు ఇంపార్టెంట్ అలెర్ట్.. కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ గురించి తెలుసా..? ఇకపై వీళ్లకు కూడా..!

ఆకలేస్తే పొయ్యి వెలిగించాల్సిన పని లేకుండా.. స్మార్ట్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే.. సమయంతో సంబంధం లేకుండా కోరుకున్న ఆహార పదార్థాలన్నీ వేడి వేడిగా ఇంటికి క్యూకట్టే రోజులివి. దీంతో ఎక్కువ శాతం యువత.. స్వయంపాకానికి స్వస్తి చెబుతూ స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌లనే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‍‌లలో జొమాటో ముందు వరుసలో ఉంది. దీంతో యూజర్లకు సౌకర్యవంతంగా ఉండేలా యాప్‌లో వివిధ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తుంటారు. తాజాగా, యూజర్లకు జొమాటో నుంచి ఇంపార్టెంట్ అలెర్ట్ వచ్చింది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం (Online food delivery platform) అయిన జొమాటో.. తన యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను (New feature for Zomato users) అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఎంతో రుచిగా ఉంటే.. ‘‘అరె! ఎవరో గానీ వంట భలే చేశారు’’.. అని అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు వంట చేసిన వారిని (Appreciating the kitchen staff) ప్రశంసించాలని అనిపిస్తుంది.. కానీ అధి సాధ్యం కాకపోవడంతో మిన్నకుండిపోతుంటాం. అయితే ఇకపై అలా అనిపిస్తే.. వెంటనే ఎక్కడో ఉన్న కిచెన్ సిబ్బందిని అభినందించవచ్చు.

Viral Video: వామ్మో! ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. జిమ్ సెంటర్‌లో ఈ అమ్మాయి విన్యాసం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

హోటల్ కిచెన్ సిబ్బందిని ప్రశంసించడం కోసం జొమాటో ‘‘Tips for Kitchen Staff’’ పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సాయంతో తమకు నచ్చిన హోటల్ కిచెన్ సిబ్బందికి ప్రశంసలు అందించవచ్చు. ‘‘జొమాటో యాప్‌లో కొత్త ఫీచర్‌ని పరిచయం చేయడం నాకు ఎంతో గర్వంగా ఉంది’’.. అని పేర్కొంటూ Zomato CEO దీపీందర్ గోయల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు. కిచెన్ స్టాఫ్‌ను ప్రశంసించడమే కాకుండా వారికి సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటూ టిప్ కూడా ఇచ్చే వెసులుబాటును కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: అభిమానం తలకెక్కితే.. ఇలాగే ఉంటుందేమో.. జవాన్ సినిమాలో షారూఖ్ స్టయిల్‌లో రైలెక్కిన అభిమాని.. చివరకు..!

Updated Date - 2023-09-22T18:09:30+05:30 IST