Crime Twist: రోడ్డుపై పడిపోయిందంటూ 73 ఏళ్ల వృద్ధురాలిని ఆస్పత్రికి తెచ్చాడో కారు డ్రైవర్.. సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-09-21T16:12:46+05:30 IST

పోలీస్ స్టేషన్లలో నిత్యం వివిధ రకాల కేసులు నమోదవుతుంటాయి. వాటిలో కొన్ని కేసులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. ఎంత ప్రయత్నించినా అసలు నేరస్థులు పట్టుకోవడంలో కొన్నిసార్లు చాలా కష్టమువుతుంటుంది. అయితే ప్రస్తుతం దాదాపు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండడంతో..

Crime Twist: రోడ్డుపై పడిపోయిందంటూ 73 ఏళ్ల వృద్ధురాలిని ఆస్పత్రికి తెచ్చాడో కారు డ్రైవర్.. సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..!
ప్రతీకాత్మక చిత్రం

పోలీస్ స్టేషన్లలో నిత్యం వివిధ రకాల కేసులు నమోదవుతుంటాయి. వాటిలో కొన్ని కేసులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. ఎంత ప్రయత్నించినా అసలు నేరస్థులు పట్టుకోవడంలో కొన్నిసార్లు చాలా కష్టమువుతుంటుంది. అయితే ప్రస్తుతం దాదాపు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండడంతో.. చాలా కేసులను పోలీసులు సులభంగా పరిష్కరిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన కళ్ల ముందు ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోది. వృద్ధురాలు రోడ్డుపై పడిపోయిందంటూ ఓ కారు డ్రైవర్.. ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే చివరకు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

ముంబైలోని (Mumbai) సియోన్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 73ఏళ్ల వృద్ధురాలు (old woman) .. బుధవారం ఇదే ప్రాంతంలోని ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైంది. సియోన్‌లో రోడ్డు దాటుతుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. అన్సారీ అనే వ్యక్తి కారులో వేగంగా వచ్చి వృద్ధురాలిని (car hit the old woman) ఢీకొన్నాడు. తర్వాత వెంటనే ఆమెను కారులో ఎక్కించుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. అయితే ఈ కేసు తన మీదకు రాకుండా ఉండేందుకు కట్టు కథ అల్లాడు. వృద్ధురాలు కళ్లు తిరిగి కిందపడిపోయిందని, తాను గమనించి ఆస్పత్రికి తీసుకొచ్చానని.. వృద్ధురాలి కుమార్తెకు ఫోన్ చేసి చెప్పాడు.

Crime news: అప్పటిదాకా కలిసున్న ప్రియురాలు.. ప్రియుడి చర్మంలో సమస్య ఉందని తెలియడంతో.. చివరకు ఏం చేసిందంటే..

దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకొచ్చినందుకు.. కారు డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే వృద్ధురాలు చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే తర్వాత ఓ రోజు సీసీ టీవీ ఫుటేజీ (CCTV footage) పరిశీలిస్తుండగా.. అసలు విషయం బయటపడింది. దీంతో కారు డ్రైవర్‌ను (Car driver arrested) అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Snake Video: ఇంటి ముందు వంట చేసుకుంటున్న మహిళ.. వెనుక నుంచి వచ్చి ఆమె కుర్చీ కిందకు దూరిన పాము.. చివరకు..!

Updated Date - 2023-09-21T16:12:46+05:30 IST