Viral Video: ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. మల్టీప్లెక్స్‌లలో కూల్‌డ్రింక్స్, స్నాక్స్ ఖరీదు ఎక్కువని ఏం చేశాడో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-09-20T15:05:56+05:30 IST

పెద్ద నగరాల్లో మల్టీప్లెక్స్‌లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. షాపింగ్ చేయాలన్నా, వినోదం కావాలన్నా, ఆటలు ఆడుకోవాలన్నా.. అన్నీ అందులోనే ఉంటాయనే విషయం తెలిసిందే. ఒక్కసారి వాటిలోకి అడుగుపెడితే అదో కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉంటుంది. దీంతో డబ్బులున్న వారితో పాటూ కాసేపు వినోదం కావాలనుకునే...

Viral Video: ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. మల్టీప్లెక్స్‌లలో కూల్‌డ్రింక్స్, స్నాక్స్ ఖరీదు ఎక్కువని ఏం చేశాడో మీరే చూడండి..!

పెద్ద నగరాల్లో మల్టీప్లెక్స్‌లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. షాపింగ్ చేయాలన్నా, వినోదం కావాలన్నా, ఆటలు ఆడుకోవాలన్నా.. అన్నీ అందులోనే ఉంటాయనే విషయం తెలిసిందే. ఒక్కసారి వాటిలోకి అడుగుపెడితే అదో కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉంటుంది. దీంతో డబ్బులున్న వారితో పాటూ కాసేపు వినోదం కావాలనుకునే ప్రతి ఒక్కరూ మల్టీప్లెక్స్‌ల బాట పడుతుంటారు. అయితో వీటిలోని సౌకర్యాలు మనల్ని ఎంతలా ఆశ్చర్యపరుస్తాయో.. వాటి ధరలు కూడా అంతే స్థాయిలో షాక్ ఇస్తుంటాయి. దీంతో చాలా మంది అంత ఖర్చు చేయలేక వారికి ఉన్నంతలో సర్దుకుపోతుంటారు. ఇక సినిమా హాళ్లలో తినుబండారాల ధరల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఇలాంటి పరిస్థితి ముందే ఊహించిన ఓ వ్యక్తి.. సినిమా థియేటర్‌లోకి వెళ్లే ముందు చాలా తెలివిగా ఆలోచించాడు. మల్టీప్లెక్స్‌లలో కూల్‌డ్రింక్స్, స్నాక్స్ ఖరీదు ఎక్కువనే ఉద్దేశంతో వెరైటీ ప్లాన్ వేశాడు.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి అక్షయ్ కుమార్ సినిమా (Akshay Kumar movie) చూసేందుకు మల్టీప్లెక్స్‌కు వెళ్లాడు. అయితే వెళ్లే ముందు చాలా తెలివిగా ఆలోచించాడు. మల్టీప్లెక్స్‌లో (Multiplex) కూల్‌డ్రింక్స్, స్నాక్స్ ఖరీదు ఎక్కువనే విషయం తెలుసుకుని ఏదోటి చేసి, ఎవరికీ తెలీకుండా తినుబండారాలను తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి చివరకు ఓ అద్భుతమైన ప్లాన్ వేశాడు. షూ బాక్స్‌లో కొన్ని చిప్స్ ప్యాకెట్లు, కూల్‌డ్రింక్స్ తదితరాలను (chips Packets, cool drinks in shoe box) ఉంచి.. అనుమానం రాకుండా ఉండేందుకు చివరగా బాక్స్‌ పైన టేప్ వేశాడు. తర్వాత దాన్ని ఓ బ్యాగులో ఉంచుకుని స్టైల్‌గా థియేటర్‍‌లోకి అడుగుపెట్టాడు.

Viral Video: ‘‘పంతం నీదా.. నాదా.. సై’’.. అంటూ పోటీ పడిన మొసలి, గేదె.. చివరికి ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏంటంటే..

థియేటర్ లోపలికి వెళ్లే ముందు అతడి బ్యాగును సిబ్బంది చెక్ చేశారు. కానీ వారికి ఎలాంటి సందేహం రాలేదు. సెక్యూరిటీ చెకప్ నుంచి విజయంవతంగా దాటుకుని సంతోషంగా థియేటర్ లోకి అడుగుపెట్టాడు. లోపల కుర్చీల్లో కూర్చున్న తర్వాత స్నేహితులతో కలిసి తాను తెచ్చుకున్న స్నాక్స్‌ని తింటూ ఎంజాయ్ చేశాడు. పనిలో పనిగా ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ‘‘మల్టీప్లెక్స్‌లో ఇలా చేయడమే కరెక్ట్’’... అని కొందరు, ‘‘మీ ఐడియా అద్భుతం బాసూ’’.. అని మరికొందరు, ‘‘నేను థియేటర్‌లో పని చేస్తుంటా.. ఈసారి ఇలా ఎవరైనా తీసుకొస్తే పక్కన పడేస్తా’’.. అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం 20లక్షలకు పైగా లైక్‍‌లను సొంతం చేసుకుంది.

Hostel Girls: రాత్రి 10 గంటల సమయం.. సడన్‌గా పోలీస్ స్టేషన్‌‌కు వచ్చిన 60 మంది బాలికలు.. ఏడుస్తూ వాళ్లంతా చెప్పింది విని..!

Updated Date - 2023-09-20T15:05:56+05:30 IST