Crime news: అప్పటిదాకా కలిసున్న ప్రియురాలు.. ప్రియుడి చర్మంలో సమస్య ఉందని తెలియడంతో.. చివరకు ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-09-20T21:53:13+05:30 IST

వారిద్దరూ కొన్నినెలలుగా ప్రేమించుకుంటున్నారు. అందరిలాగానే ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు ఎదురుకాలేదు. అయితే ఇటీవల ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ప్రియుడికి....

Crime news: అప్పటిదాకా కలిసున్న ప్రియురాలు.. ప్రియుడి చర్మంలో సమస్య ఉందని తెలియడంతో.. చివరకు ఏం చేసిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరూ కొన్నినెలలుగా ప్రేమించుకుంటున్నారు. అందరిలాగానే ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు ఎదురుకాలేదు. అయితే ఇటీవల ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ప్రియుడికి చర్మ వచ్చిందని తెలుసుకున్న ప్రియురాలు సడన్ నిర్ణయం తీసుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయంతో చివరకు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పన్నా జిల్లాలోని షానగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన సప్న అనే యువతి (young woman) .. ఇదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్‌గా (Contract teacher) పని చేస్తుండేది. ఈమెకు ఇదే ప్రాంతానికి చెందిన గౌతమ్ అనే యువకుడితో కొన్ని నెలల క్రితం పరిచయమయ్యాడు. తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి.. అది కాస్త ప్రేమకు (love) దారి తీసింది. అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఈ క్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇటీవల గౌతమ్‌కు చర్మ సమస్య (skin problem) వచ్చింది. దీంతో తరచూ ఆస్పత్రుల చుట్టూ తిరిగేవాడు.

Viral Video: ఇది స్కూటీ కాదమ్మాయ్.. బుల్లెట్ బండి.. కిక్ కొట్టడం అంత ఈజీ కాదంటూ నెట్టింట సెటైర్లు.. ఇంతకీ అసలేమైందంటే..!

ఈ విషయం తెలియగానే సప్న తన మనసు మార్చుకుంది. అప్పటిదాకా ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఆమె.. ఆ ఒక్క కారణంతో అతన్ని దూరం పెట్టేసింది. అయినా గౌతమ్ ఆమెను మర్చిపోలేక.. తరచూ కలవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ సప్న మాత్రం అతన్ని కలవడానికి ఇష్టపడలేదు. దీంతో చివరకు ఆమెపై గౌతమ్ పగ పెంచుకున్నాడు. చివరకు ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. సెప్టెంబర్ 13న ప్రియురాలికి ఫోన్ చేసి, అర్జంట్‌గా మాట్లాడాలని రమ్మన్నాడు. తర్వాత ఆమెను బైకుపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై కత్తితో విచక్షణారహితంగా (boyfriend killed his girlfriend) దాడి చేసి హత్య చేశాడు.

Viral Video: రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న ఈ పిల్లల వీడియోను చూస్తే.. గతం గుర్తుకు రావడం ఖాయం..!

చివరగా మొఖం గుర్తుపట్టలేని విధంగా చితకబాది.. అక్కడి నుంచి పరారయ్యాడు. సెప్టెంబర్ 13 సాయంత్రం కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆమె కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలో స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చివరకు గౌతమ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Wife: చెట్ల పొదల్లో ఓ వ్యక్తి మృతదేహం.. హత్యేనని తేల్చేసిన పోలీసులు.. భార్యను విచారిస్తే వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!

Updated Date - 2023-09-20T21:53:13+05:30 IST