Viral Video: రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న ఈ పిల్లల వీడియోను చూస్తే.. గతం గుర్తుకు రావడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-09-20T18:12:02+05:30 IST

స్కూలు డేస్‌లో ఒకప్పటికి, ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకి పంపడం షరా మామూలైంది. దీంతో దాదాపు చాలా మంది పిల్లలు స్కూలు బస్సుల్లోనే, ఇంకా డబ్బులున్న వారైతే తమ పిల్లల్ని బైకులు, కార్లలో వదిలిపెట్టడం చూస్తూ ఉంటాం. అయితే అప్పట్లో ...

Viral Video: రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న ఈ పిల్లల వీడియోను చూస్తే.. గతం గుర్తుకు రావడం ఖాయం..!

స్కూలు డేస్‌లో ఒకప్పటికి, ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకి పంపడం షరా మామూలైంది. దీంతో దాదాపు చాలా మంది పిల్లలు స్కూలు బస్సుల్లోనే, ఇంకా డబ్బులున్న వారైతే తమ పిల్లల్ని బైకులు, కార్లలో వదిలిపెట్టడం చూస్తూ ఉంటాం. అయితే అప్పట్లో ఇలాంటి సౌకర్యాలు ఉండేవి కాదు కాబట్టి.. దాదాపు అంతా స్కూలుకు నడుచుకుంటూ వెళ్లడం తెలిసిందే. స్నేహితులంతా మాట్లాడుకుంటూ కిలోమీటర్ల మేర స్కూలుకు నడుస్తూ వెళ్లిన సందర్భాలు కూడా చాలా మంది విషయంలో జరిగే ఉంటుంది. చిన్ననాటి ఆ మధుర జ్ఞాపకాలను సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటుంటారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎన్నో ఘటనలు.. వీడియోలు, ఫొటోల రూపంలో మన గతాన్ని గుర్తు చేస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది..

స్కూలు పిల్లలకు సంబంధించిన వీడియో (school children Videos) ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సిక్కింలోని (Sikkim) గ్యాంగ్‌టక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు స్కూలు నుంచి ఇంటికి వెళ్తూ కనిపించారు. ఇందులో విశేషం ఏముందీ! అని అనుకుంటున్నారా.. వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని, ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ వెళ్లడం చూసి అక్కడున్న వారంతా వారి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పిల్లలిద్దరూ ఒకరి భుజం మరొకరు చేయి వేసుకుని వెళ్లడమే కాకుండా ఒకరిపై మరొకరు ఎంతో అభిమానాన్ని చూపిస్తూ.. సరదాగా కబుర్లు చెప్పుకొంటూ వెళ్లడం అందరికీ చూడముచ్చటగా అనిపిస్తోంది.

Viral Video: ఇంట్లోంచి అదే పనిగా ఓ పిల్లి అరుపులు.. ఎక్కడ ఉందో కనిపెట్టలేక ఆగమాగం.. చివరకు డ్రైనేజీ పైపులో చూస్తే..!

అక్కడే ఉన్న ఓ వ్యక్తి వారిని వీడియో తీస్తూ ఉండిపోయాడు. కెమెరా వైపు చూసిన ఆ ఇద్దరు చిన్నారులు.. ఎలాంటి ఫీలింగ్ లేకుండా.. మళ్లీ వారి మాటల్లో మునిగిపోవడం చూసి ఆ వ్యక్తి కూడా అవాక్కయ్యాడు. స్నేహం అంటే ఇలాగే ఉండాలి అనే విధంగా వారి ప్రవర్తన ఉండడం అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తమ పాత రోజులను గుర్తు చేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఆ రోజులు ఎంతో బాగుండేవి.. ఇప్పుడు ఎన్ని సౌకర్యాలు ఉన్నా.. అప్పట్లో ఉన్న ఆనందం మాత్రం దొరకడం లేదు’’.. అని కొందరు, ‘‘చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేం’’.. అని మరికొందరు, ‘‘మా స్కూలుకూ ఇలాగే సరదాగా మాట్లాడుకుంటూ వెళ్లేవాళ్లం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Metro Train Video: మెట్రో రైల్లో మస్తు షో చేసిన కుర్రాడు.. పక్కన నిల్చున్న ఆ పెద్దాయన రియాక్షన్‌తో అతడికి మైండ్‌బ్లాక్..!

Updated Date - 2023-09-20T18:12:02+05:30 IST