Metro Train Video: మెట్రో రైల్లో మస్తు షో చేసిన కుర్రాడు.. పక్కన నిల్చున్న ఆ పెద్దాయన రియాక్షన్‌తో అతడికి మైండ్‌బ్లాక్..!

ABN , First Publish Date - 2023-09-20T15:49:19+05:30 IST

జూలలో కనిపించే వింతలు, విశేషాలతో పాటూ సినిమాల్లో కనిపించే పోట్లాట సన్నివేశాలు, వినోదం.. ఇలా ప్రతీదీ ప్రస్తుతం మెట్రో రైళ్లలోనే కనిపిస్తోంది. కొందరు సీట్ల కోసం చిన్న పాటి యుద్ధాలు చేయడం చూశాం. అలాగే చిత్రవిచిత్రమైన డ్రస్సులతో ప్యాషన్ షోలు చేయడం చూశాం. అదేవిధంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ..

Metro Train Video: మెట్రో రైల్లో మస్తు షో చేసిన కుర్రాడు.. పక్కన నిల్చున్న ఆ పెద్దాయన రియాక్షన్‌తో అతడికి మైండ్‌బ్లాక్..!

జూలలో కనిపించే వింతలు, విశేషాలతో పాటూ సినిమాల్లో కనిపించే పోట్లాట సన్నివేశాలు, వినోదం.. ఇలా ప్రతీదీ ప్రస్తుతం మెట్రో రైళ్లలోనే కనిపిస్తోంది. కొందరు సీట్ల కోసం చిన్న పాటి యుద్ధాలు చేయడం చూశాం. అలాగే చిత్రవిచిత్రమైన డ్రస్సులతో ప్యాషన్ షోలు చేయడం చూశాం. అదేవిధంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ డాన్సులు వేసే యువతులను కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మెట్రో రైల్లో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కుర్రాడు మెట్రో రైల్లో అందరి ముందూ పుషప్స్ చేస్తూ పెద్ద షోనే చేశాడు. అయితే చివరకు ఓ పెద్దాయన ఇచ్చిన రియాక్షన్‌తో అతడికి మైండ్ బ్లాక్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Videos) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు మెట్రో రైల్లో (metro train) బోగీ డోరు వద్ద నిల్చుని ఉంటాడు. అంతా చూస్తుండగా అతడి స్నేహితుడిని వీడియో తీయమని చెప్పి.. సడన్‌గా బోగీ మధ్యలోకి (young man doing push-ups in metro train) వచ్చి పుషప్స్ తీస్తాడు. రెండు చేతులతో కొన్ని, ఒంటి చేత్తో మరికొన్ని పుషప్స్ తీస్తాడు. ఇతడి ప్రవర్తన చూసి పక్కనే కూర్చున్న వారంతా అవాక్కవుతారు. అలాగే ఆ పక్కనే నిల్చుని ఉన్న ఓ పెద్దాయన కూడా చూస్తూ ఉంటాడు. సదరు యువకుడు ఇలా కొద్ది సేపు పుషప్స్ తీసి, తర్వాత పైకి లేచి పెద్దాయన వద్దకు వెళ్తాడు. ‘‘రండి.. మీరు కూడా పుషప్స్ తీయండి’’.. అని పిలుస్తాడు.

Viral Video: ‘‘పంతం నీదా.. నాదా.. సై’’.. అంటూ పోటీ పడిన మొసలి, గేదె.. చివరికి ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏంటంటే..

అయితే ఇందుకు ఆ వ్యక్తి.. ‘‘అయ్యో! నా వల్ల కాదండి.. అయినా ఇక్కడ బాగోదు’’.. అని ముందు అనాసక్తి చూపిస్తాడు. అయినా యువకుడు మాత్రం పుషప్స్ తీయండి.. అంటూ బలవంతం చేస్తాడు. దీంతో ఆ వ్యక్తి చివరకు పుషప్స్ తీసేందుకు సిద్ధమవుతాడు. చివరకు అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. యువకుడి కంటే వేగంగా ఎక్కువ పుషప్స్ తీస్తాడు. దీంతో యువకుడు కూడా చివరకు షాక్ అవుతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది స్క్రిప్టెడ్ అయినా అంకుల్ బాగా చేశాడు’’.. అని కొందరు, ‘‘మెట్రో రైళ్లను ఇలా వాడుకుంటున్నారేంట్రా’’.. అని మరికొందరు, ‘‘యువకులకంటే పుషప్స్ బాగా తీశారు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. మల్టీప్లెక్స్‌లలో కూల్‌డ్రింక్స్, స్నాక్స్ ఖరీదు ఎక్కువని ఏం చేశాడో మీరే చూడండి..!

Updated Date - 2023-09-20T15:49:19+05:30 IST