Viral Video: వామ్మో! ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. జిమ్ సెంటర్‌లో ఈ అమ్మాయి విన్యాసం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2023-09-22T15:01:25+05:30 IST

ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా దూసుకెళ్తున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపారం అనే తేడా లేకుండా అన్ని విషయాల్లోనూ పోటాపోటీగా ముందుకు వెళ్తున్నారు. ఇక కొందరైతే యువకులను కూడా ఆశ్యర్యపరుస్తూ చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ప్రస్తుతం..

Viral Video: వామ్మో! ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. జిమ్ సెంటర్‌లో ఈ అమ్మాయి విన్యాసం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా దూసుకెళ్తున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపారం అనే తేడా లేకుండా అన్ని విషయాల్లోనూ పోటాపోటీగా ముందుకు వెళ్తున్నారు. ఇక కొందరైతే యువకులను కూడా ఆశ్యర్యపరుస్తూ చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వారికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అమ్మాయి చేసిన విన్యాసం చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ హల్‌చల్ చేస్తోంది. జిమ్ సెంటర్‌లో (Gym Center) ఓ యువతి విచిత్ర విన్యాసం చేసేందుకు (Young woman stunt) సిద్ధమైంది. కింద ఓ వ్యక్తి పడుకుని ఉండగా.. ఆ యువతి అతడికి ఎదురుగా ఉన్న ఇనుప స్టాండ్ పట్టుకుని విన్యాసం చేసింది. ఇనుప స్టాండ్‌ను పట్టుకుని అటూ ఇటూ వేలాడుతూ వేగం అందుకోగానే ఒక్కసారిగా చేతులు వదిలేసి గాల్లోనే గింగిరాలు తిరిగింది. ఇలా రౌండ్లు తిరుగుతూ చివరకు సరిగ్గా కింద పరుపుపై పడుకుని ఉన్న యువకుడి మీద దూకేస్తుంది. అయితే ఈ క్రమంలో ఆమె కాళ్లు అతడిపై పడతాయేమో అని అనిపిస్తుంది.

Chicken Curry: చికెన్ కర్రీ తెచ్చిన తంటా.. మూడేళ్ల నుంచి సాగుతున్న కేసు.. చివరకు రూ.25 వేల జరిమానా.. అసలు కథేంటంటే..!

అయితే ఆశ్చర్యకరంగా అతడి తలకు ఓ కాలు అటు వైపు, ఇంకో కాలు ఇటు వైపు పెట్టి అలాగే నిలబడుతుంది. ఈ క్రమంలో పడుకుని ఉన్న వ్యక్తి.. ఎక్కడ మీద పడుతుందో అని భయపడతాడు. అయితే ఆమె మాత్రం ఈ విన్యాసాన్ని చాకచర్యంగా చేసేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అని కొందరు, ‘‘ఏమాత్రం అటు, ఇటు అయినా ఇక అంతే’’.. అని మరికొందరు, ‘‘ఈ అమ్మాయి ట్యాలెంట్‌కి హ్యాట్సాప్’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Wife: మూడేళ్ల క్రితం నాటి సినిమా స్టోరీ.. రియల్‌లైఫ్‌లో రిపీట్.. అందరి ముందు భర్త తనను నవ్వులపాలు చేశాడని ఓ భార్య నిర్ణయమిదీ..!

Updated Date - 2023-09-22T15:02:20+05:30 IST