Wife: మూడేళ్ల క్రితం నాటి సినిమా స్టోరీ.. రియల్‌లైఫ్‌లో రిపీట్.. అందరి ముందు భర్త తనను నవ్వులపాలు చేశాడని ఓ భార్య నిర్ణయమిదీ..!

ABN , First Publish Date - 2023-09-21T19:37:08+05:30 IST

వేడుకలో బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఎదుట తనపై చేయి చేసుకున్నాడనే ఒకే ఒక్క కారణంతో ఏకంగా ఓ భార్య తన భర్తకు ఏకంగా విడాకులే ఇచ్చేసింది. అతడిపై ఎలాంటి అభియోగాలూ మోపకుండా.. కేవలం చెంప దెబ్బ కొట్టాడనే ఒకే ఒక్క కారణాన్ని సాకుగా చూపుతుంది. విచిత్రంగా అనిపిస్తున్న...

Wife: మూడేళ్ల క్రితం నాటి సినిమా స్టోరీ.. రియల్‌లైఫ్‌లో రిపీట్.. అందరి ముందు భర్త తనను నవ్వులపాలు చేశాడని ఓ భార్య నిర్ణయమిదీ..!
ప్రతీకాత్మక చిత్రం

వేడుకలో బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఎదుట తనపై చేయి చేసుకున్నాడనే ఒకే ఒక్క కారణంతో ఏకంగా ఓ భార్య తన భర్తకు ఏకంగా విడాకులే ఇచ్చేసింది. అతడిపై ఎలాంటి అభియోగాలూ మోపకుండా.. కేవలం చెంప దెబ్బ కొట్టాడనే ఒకే ఒక్క కారణాన్ని సాకుగా చూపుతుంది. విచిత్రంగా అనిపిస్తున్న ఈ ఘటన.. హీరోయిన్ తాప్సీ నటించిన బాలీవుడ్ చిత్రం తప్పడ్ సినిమాలోనిది. అయితే ఇలాంటివి కేవలం సినిమాల్లోనే సాధ్యం.. నిజ జీవితంలో అసాధ్యం అని అంతా అనుకుంటాం. కానీ ఇంతకంటే చిన్న కారణంతో ఓ మహిళ సంచలన నిర్ణయం తీసుకుంది. అందరి ముందు భర్త తనను నవ్వులపాలు చేశాడని ఓ భార్య షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

న్యూయార్క్‌కు (New York) చెందిన ఓ యువతి తన వివాహమైన రోజే సంచలన నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఆమె వివాహం ఘనంగా జరిగింది. అంతా ఆనందంగా ఉన్న సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వివాహానంతరం బంధవుల సమక్షంలో వధూవరులు కేక్ కట్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే కేక్ కట్ చేసే సమయంలో వరుడు కాస్త అత్యుత్సాహం చూపించాడు. కేక్ కట్ చేసిన అనంతరం అందులోని ఓ పెద్ద ముక్క తీసుకుని.. వధువు మొఖంపై రుద్దేశాడు. దీంతో అమె మొఖం మొత్తం కేక్ మయమైపోయింది. దీంతో చుట్టూ ఉన్న వారంతా ఒక్కసారిగా పక్కున నవ్వారు. దీంతో వధువుకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. ‘‘అందరి ముందూ నన్ను ఇంతలా అవమానిస్తావా... ఈ పెళ్లీ వద్దూ.. నువ్వూ వద్దూ’’.. అని అనుకుంటూ అక్కడి నుంచి నేరుగా వెళ్లిపోతుంది.

Woman: కాబోయే భార్యే కదా అని అతిగా నమ్మేశాడు.. చివరకు కోటి రూపాయలు మటాష్.. ఇదేంటని ఆమెను నిలదీస్తే..!

వధువు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వరుడితో (groom) పాటూ అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అంతా ఆమెకు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వధువు (bride) మాత్రం వినిపించుకోలేదు. చివరకు వరుడు సారీ.. అని చెప్పినా ఆమె కోపం మాత్రం తగ్గలేదు. నేరుగా కళ్యాణ మంటపం నుంచి బయటికి వచ్చి.. క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లిపోయింది. తనకు భర్త వద్దంటూ విడాకుల (Divorce) కోసం కోర్టును ఆశ్రయించింది. తన సమస్యను వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు షేర్ చేసింది. అప్పటికీ ఇలాంటివి తనకు నచ్చవంటూ ముందే తన భర్తను హెచ్చరించానని, అయినా తాను పట్టించుకోకుండా మొఖంపై కేకు పూశాడని చెప్పింది.

Snake Video: ఇంటి ముందు వంట చేసుకుంటున్న మహిళ.. వెనుక నుంచి వచ్చి ఆమె కుర్చీ కిందకు దూరిన పాము.. చివరకు..!

కేకు పూయడంతో తన మొఖంతో డ్రస్సు కూడా పాడయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటివి తనకు నచ్చదని చెబుతూనే అందుకు గల కారణాన్ని వివరించింది. తన చిన్నతనంలో పుట్టిన రోజున జరిగిన ఘటనను గుర్తు చేసుకుంది. తల్లి తన మొఖాన్ని కేక్‌లోకి నెట్టేసిందని, దీంతో కొవ్వొత్తి కాలి మొఖానికి చిన్న చిన్న గాయాలయ్యాయని చెప్పింది. దీంతో అప్పటి నుంచి తనకు ఇలాంటి పనులు నచ్చవని వధువు పేర్కొంది. కాగా, ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట (Viral news) తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇంత చిన్న కారణానికే విడాకులా’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో! ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా’’.. అని మరికొందరు, ‘‘ఇలా చేయడం తప్పు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Crime Twist: రోడ్డుపై పడిపోయిందంటూ 73 ఏళ్ల వృద్ధురాలిని ఆస్పత్రికి తెచ్చాడో కారు డ్రైవర్.. సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..!

Updated Date - 2023-09-21T19:38:44+05:30 IST