Shocking Video: ఈ ఇద్దరు కుర్రాళ్లకు ప్రాణాల విలువేంటో తెలిసినట్టు లేదు.. పాత బిల్డింగ్‌పై ఎలాంటి రిస్క్ చేస్తున్నారో చూస్తే..!

ABN , First Publish Date - 2023-09-22T19:18:44+05:30 IST

ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు ప్రస్తుతం చాలా మంది యువకులు ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. కొందరైతే మరీ దారుణంగా తమ ప్రాణాలను గడ్డి పోచతో సమానం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇంకొందరు సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం...

Shocking Video: ఈ ఇద్దరు కుర్రాళ్లకు ప్రాణాల విలువేంటో తెలిసినట్టు లేదు.. పాత బిల్డింగ్‌పై ఎలాంటి రిస్క్ చేస్తున్నారో చూస్తే..!

ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు ప్రస్తుతం చాలా మంది యువకులు ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. కొందరైతే మరీ దారుణంగా తమ ప్రాణాలను గడ్డి పోచతో సమానం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇంకొందరు సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం ప్రమాదకర విన్యాసాలు చేయడం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. అయినా కొందరిలో ఎలాంటి మార్పూ రావడం లేదు. ఒళ్లు గగుర్పొడిచే సాహసాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇద్దరు యువకులకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. పాత బిల్డింగ్‌పై విరిగిపోయిన స్లాబ్ మీద వారు చేసిన రిస్క్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు రీల్స్ చేసేందుకు పాత బిల్డింగ్ (Old building) వద్దకు వెళ్లారు. ఎలాగైనా ఎక్కువ వ్యూస్, లైక్‌లు సంపాదించాలనే కోరికతో చివరకు డేంజరస్ స్టంట్ (Dangerous stunt) చేశారు. బిల్డింగ్ పైకి వెళ్లి గోడ చివరన మెట్ల తరహాలో ఉన్న స్లాబ్ మీద నడవడం మొదలెడతారు. ఏమాత్రం భయం లేకుండా వాటిపై తాపీగా నడుస్తూ వెళ్తారు. కిందకు చూస్తేనే కళ్లు తిరిగినట్లుగా ఉన్న ఆ ప్రాంతంలో వారు మాత్రం ఎక్కడా భయపడకుండా చకచకా నడుచుకుంటూ వెళ్లారు. మధ్య మధ్యలో స్లాబ్‌లు పూర్తిగా విరిగిపోయాయి. అయినా గోడ పక్కన ఉన్న కిటికీల సపోర్టుతో నడుచుకుంటూ వెళ్తారు.

Viral Video: అభిమానం తలకెక్కితే.. ఇలాగే ఉంటుందేమో.. జవాన్ సినిమాలో షారూఖ్ స్టయిల్‌లో రైలెక్కిన అభిమాని.. చివరకు..!

అలా ఇటు వైపు నుంచి అటు వైపునకు వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోతారు. వారిలో ఓ యువకుడు కాస్త భయపడినా చివరకు ఎలాగోలా అటు వైపు చేరుకుంటాడు. అయితే మధ్యలో ఏమాత్రం కాలు జారినా నేరుగా ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. అయినా వారు మాత్రం ఇలాంటి విన్యాసాలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఇదేంట్రా.. మీకు భయమే లేదా’’.. అని కొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎవరూ చేయకండి’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి వారిని చూసి మిగతా వారు ప్రమాదంలో పడుతున్నారు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Zomato: జొమాటో యూజర్లకు ఇంపార్టెంట్ అలెర్ట్.. కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ గురించి తెలుసా..? ఇకపై వీళ్లకు కూడా..!

Updated Date - 2023-09-22T19:18:44+05:30 IST