Viral Video: మెషీన్స్ అక్కర్లేదట.. ఒట్టి చేతులే చాలట.. ఈ పెద్దాయన టాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

ABN , First Publish Date - 2023-09-22T20:41:47+05:30 IST

టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తూ కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. అయితే సమయం వచ్చినప్పుడు అది బయటపడుతుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి మట్టిలో మాణిక్యాల గురించి క్షణాల్లో ప్రపంచం నలుమూలలకూ తెలుస్తోంది. కొందరి టాలెంట్ చూస్తే..

Viral Video: మెషీన్స్ అక్కర్లేదట.. ఒట్టి చేతులే చాలట.. ఈ పెద్దాయన టాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తూ కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. అయితే సమయం వచ్చినప్పుడు అది బయటపడుతుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి మట్టిలో మాణిక్యాల గురించి క్షణాల్లో ప్రపంచం నలుమూలలకూ తెలుస్తోంది. కొందరి టాలెంట్ చూస్తే.. ‘‘అరె! ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. ఎవరికీ సాధ్యం కాని పనులను కొందరు అవలీలలగా చేసేస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పెద్దాయన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. మెషీన్ అక్కర్లేకుండానే.. ఇటుకలను అత్యంత చాకచక్యంగా కట్ చేస్తున్న పెద్దాయనను చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్దాయన ఇటుకల ఫ్యాక్టరీలో పని చేస్తుంటాడు. ఇందులో ఎలాంటి విశేషమూ లేకున్నా.. అతడు చేసిన విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పెద్ద పెద్ద రాళ్లను మిషిన్లతో పలకలుగా కట్ చేయడం చూస్తూ ఉంటాం. ఇదే పని మనుషులు చేయడం సాధ్యం కాదు. అందులోనూ ఇటుకలను పలకలుగా కట్ చేయడం అసలు సాధ్యం కాదు అనుకుంటాం. కానీ ఆ పనిని ఈ పెద్దాయన (old man cut bricks into slabs) ఈజీగా చేసి పడేశాడు. అది కూడా వేగంగా చేయడంతో పాటూ ఎంతో చాకచక్యంగా చేసేశాడు.

Shocking Video: ఈ ఇద్దరు కుర్రాళ్లకు ప్రాణాల విలువేంటో తెలిసినట్టు లేదు.. పాత బిల్డింగ్‌పై ఎలాంటి రిస్క్ చేస్తున్నారో చూస్తే..!

మందపాటి ఎర్రటి ఇటుకను తీసుకున్న అతను.. ముందుగా చుట్టూ సుత్తి, ఇనుప మొలతో ఇటుక చుట్టూ సున్నితంగా కొడతాడు. చివరకు దాన్నుంచి ఒకే సైజులో ఉన్న పలక లాంటి ముక్కను వేరు చేస్తాడు. ఇలా ఒకే ఇటుక నుంచి ఐదు పలకలాంటి ఇటులను ఒకే సైజులో వేరు చేయడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ పెద్దాయన ట్యాలెంట్‌కి ముగ్ధుడైన ఓ వ్యక్తి.. వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఈ పెద్దాయన టాలెంట్ అద్భుతం’’.. అంటూ కొందరు, ‘‘సోషల్ మీడియాలో వల్ల ఇలాంటి వారి గురించి ప్రంపంచానికి తెలుస్తోంది’’.. అని కొందరు, ‘‘మిషన్ కూడా ఇంత బాగా కట్ చేయదేమో’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: అభిమానం తలకెక్కితే.. ఇలాగే ఉంటుందేమో.. జవాన్ సినిమాలో షారూఖ్ స్టయిల్‌లో రైలెక్కిన అభిమాని.. చివరకు..!

Updated Date - 2023-09-22T20:41:47+05:30 IST