Viral Vide: అయ్య బాబోయ్! ఈ యువతి పామును ఎలా పట్టుకుందో చూస్తే.. నొరెళ్లబెట్టాల్సిందే..

ABN , First Publish Date - 2023-09-22T21:52:30+05:30 IST

పామును పట్టుకోవడంలో స్నేక్ క్యాచర్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కొందరు చేతులకు గ్లౌజులు వేసుకుని, ప్రత్యేకంగా తయారు చేసిన స్టిక్‌తో పాములను పట్టుకుంటుంటారు. అనుభవం ఉన్న మరికొందరు స్నేక్ క్యాచర్లు.. ఎంత పెద్ద పాములనైనా ఎంతో ఈజీగా పట్టుకుంటుంటారు. అయితే..

Viral Vide: అయ్య బాబోయ్! ఈ యువతి పామును ఎలా పట్టుకుందో చూస్తే.. నొరెళ్లబెట్టాల్సిందే..

పామును పట్టుకోవడంలో స్నేక్ క్యాచర్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కొందరు చేతులకు గ్లౌజులు వేసుకుని, ప్రత్యేకంగా తయారు చేసిన స్టిక్‌తో పాములను పట్టుకుంటుంటారు. అనుభవం ఉన్న మరికొందరు స్నేక్ క్యాచర్లు.. ఎంత పెద్ద పాములనైనా ఎంతో ఈజీగా పట్టుకుంటుంటారు. అయితే యువతులు మాత్రం పాములకు చాలా దూరంగా ఉంటారు. కొందరు మాత్రం తామేమీ తక్కువ కాదన్నట్లు మగవారితో సమానంగా పాములను పట్టుకుంటుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువతి పామును పట్టుకున్న విధానం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ గోడౌన్ లోకి పాము చొరబడడంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అయితే మగవారికి బదులుగా అక్కడికి ఓ యువతి ఎంటర్ అయింది. ఆమెను చూడగానే అంతా పామును ఈమెలా పట్టుకుంటుంది.. అని అనుమానపడ్డారు. అయితే చివరకు ఆమె పామును పట్టుకున్న (woman catches snake) విధానం చూసి అంతా షాక్ అయ్యారు. ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా ఒట్టి చేతులో పామును పట్టుకున్న యువతి.. కాసేపు పామును అందరికీ చూపించి అవగాహన కల్పించింది.

Viral Video: మెషీన్స్ అక్కర్లేదట.. ఒట్టి చేతులే చాలట.. ఈ పెద్దాయన టాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

తర్వాత వెరైటీగా ఓ పెద్ద ప్లాస్టిక్ పైపును తీసుకుంది. దానికి ఓ వైపు మూతను ఏర్పాటు చేసి, మరో వైపు నుంచి పామును లోపలికి పంపించింది. ఇలా పామును ఎంతో ఈజీగా పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లి, అటవీ ప్రాంతంలో వదిలేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె ట్యాలెంట్ మామూలుగా లేదుగా’’.. అని కొందరు, ‘‘వామ్మో! పామను ఎంత ఈజీగా పట్టేసింది’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Shocking Video: ఈ ఇద్దరు కుర్రాళ్లకు ప్రాణాల విలువేంటో తెలిసినట్టు లేదు.. పాత బిల్డింగ్‌పై ఎలాంటి రిస్క్ చేస్తున్నారో చూస్తే..!

Updated Date - 2023-09-22T21:53:12+05:30 IST