Viral Video: సినిమా తరహా షాట్స్ కోసం రైలు పట్టాల మీదకు వెళ్లిన యువకుడు.. తీరా ఫోన్‌లో రికార్డ్ చేస్తుండగా..

ABN , First Publish Date - 2023-09-30T22:10:02+05:30 IST

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది లైక్‌లు, వ్యూస్ కోసం ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారు. కొందరైతే రీల్స్ కోసం ప్రమాదమని తెలిసినా చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి...

Viral Video: సినిమా తరహా షాట్స్ కోసం రైలు పట్టాల మీదకు వెళ్లిన యువకుడు.. తీరా ఫోన్‌లో రికార్డ్ చేస్తుండగా..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది లైక్‌లు, వ్యూస్ కోసం ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారు. కొందరైతే రీల్స్ కోసం ప్రమాదమని తెలిసినా చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సినిమా తరహా షాట్స్ కోసం ఓ యువకుడు రైలు పట్టాల మీదకు వెళ్లాడు. తీరా ఫోన్‌లో రికార్డ్ చేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బారాబంకికి 14 ఏళ్ల యువకుడు ఇన్‌స్టా రీల్స్ (Insta Reels) చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఏదైనా కొత్తగా, సినిమా తరహాలో చేయాలనే ఉద్దశంతో తన స్నేహితుడితో కలిసి రైలు పట్టాల వద్దకు వెళ్లాడు. వెనుక వైపు రైలు వచ్చే సమయంలో పట్టాల పక్కనే నడుస్తూ వీడియో తీసుకోవాలనేది వారి కాన్సెప్ట్. అయితే ఇది ప్రమాదమని తెలిసినా రీల్స్ కోసం తెగించాడు.

Yellow Teeth: పళ్లు పచ్చగా కనిపిస్తున్నాయా..? ఈ పండు తొక్కను తీసుకుని 4 నిమిషాల పాటు రుద్దితే అద్భుతమైన రిజల్ట్..!

పట్టాల పక్కగా వెళ్లి నిలబడి ఉండగా అతడి స్నేహితుడు దూరంగా ఉన్నాడు. మరో వైపు వెనుక వైపు రైలు వస్తోంది. ఆ సమయంలో యువకుడు పట్టాలకు మరీ దగ్గరగా వెళ్లాడు. తీరా మొబైల్ తీసుకుని రికార్డ్ చేస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన రైలు అతన్ని (train hit the young man) ఢీకొట్టింది. దీంతో యువకుడు ఎగిరి దూరంగా విసిరివేయబడ్డాడు. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Amazon Sale: వాటిపై ఏకంగా 75 శాతం డిస్కౌంట్.. అమెజాన్ సేల్‌లో ఏఏ వస్తువులపై భారీ ఆఫర్లు ఉన్నాయంటే..!

Updated Date - 2023-09-30T22:10:02+05:30 IST