Amazon Sale: వాటిపై ఏకంగా 75 శాతం డిస్కౌంట్.. అమెజాన్ సేల్‌లో ఏఏ వస్తువులపై భారీ ఆఫర్లు ఉన్నాయంటే..!

ABN , First Publish Date - 2023-09-30T16:24:12+05:30 IST

దసరా, దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్ 8వ తేదీ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టవల్ సేల్‌ను ప్రారంభించబోతోంది. ఈ సేల్‌లో చాలా వస్తువులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది..

Amazon Sale: వాటిపై ఏకంగా 75 శాతం డిస్కౌంట్.. అమెజాన్ సేల్‌లో ఏఏ వస్తువులపై భారీ ఆఫర్లు ఉన్నాయంటే..!

దసరా, దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్ 8వ తేదీ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టవల్ సేల్‌ను ప్రారంభించబోతోంది. ఈ సేల్‌లో చాలా వస్తువులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్న వారికి ఒక రోజు నుంచి.. అంటే అక్టోబర్ 7వ తేదీ అర్ధరాత్రి నుంచే సేల్ అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు తదితరాలపై 75శాతం డిస్కూంట్‌ను ఇవ్వనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఈ అమెజాన్ సేల్‌లో ఏఏ వస్తువులపై భారీ ఆఫర్లు ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టవల్ సేల్‌ 2023(Amazon Great Indian Festival Sale 2023) పేరుతో అక్టోబర్ 8నుంచి ప్రారంభమవనున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అమెజాన్ పలు వస్తువులపై భారీ డిస్కౌంట్లను ఇవ్వబోతోంది. ప్రధానంగా మొబైల్, యాక్సెసరీలపై (Mobile, Accessory) 40శాంతం వరకూ భారీ తగ్గింపును పొందే అవకాశం ఉంది. అలాగే fire tv, kindle, Alexa తదితర పరికరాలపై 55శాతం వరకూ డిస్కౌంట్ ఇవ్వనున్నారు. అదేవిధంగా కిచెన్, అవుడ్ డోర్ వస్తువులపై 70శాతం వరకూ తగ్గింపు పొందవచ్చు.

Amazon-Great-Indian-Festiva.jpg

అదేవిధంగా ఈ పెస్టివల్ సేల్‌లో అమెజాన్ తమ కస్టమర్లకు.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్ ఫోన్లు, టీవీలు (Laptops, smartwatches, headphones, TVs) తదితర ఉపకరణాలపై 75శాతం వరకు తగ్గింపు ఇవ్వనుంది. మరోవైపు వస్త్రధారణ ఉత్పత్తులపై కూడా తగ్గింపు ఇవ్వనున్నారు. బొమ్మలు, పుస్తకాలు, వస్త్రధారణ ఉత్పత్తులపై 80శాతం వరకూ భారీ తగ్గింపు ఇవ్వనుంది. అలాగే ఈ సేల్‌లో కస్టమర్లు గ్రాండ్ ఓపెనింగ్ డీల్స్, కిక్ స్టార్టర్ డీల్స్, బ్లాక్ బస్టర్ డీల్స్, క్రేజీ కాంబోస్, కూపన్ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ రివార్డులు కూడా పొందే అవకాశం ఉంది.

Flipkart--sale.jpg

అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐతో (SBI) భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనివల్ల SBI క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటూ EMI ద్వారా కూడా షాపింగ్ చేయొచ్చు. ఇందులోనూ 10శాతం తక్షణ తగ్గింపును ఇవ్వనున్నారు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ కాయిన్స్ (Flipkart SuperCoins) ఉపయోగించడం ద్వారా ధర మరింత తగ్గనుంది. ఈ ఆఫర్లతో పాటూ చాలా టీవీలపై నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లను కూడా అందిస్తున్నారు. కాగా, అక్టోబర్ 8న ప్రారంభయ్యే ఈ సేల్ ముగింపు తేదీని మాత్రం అమెజాన్ వెల్లడించలేదు.

Woman: అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్న 32 ఏళ్ల మహిళ.. అడిగి మరీ లిఫ్ట్ ఇచ్చిన 26 ఏళ్ల యువకుడు.. తెల్లారేసరికి జరిగిన ఘోరమిదీ..!

Updated Date - 2023-09-30T16:34:31+05:30 IST