Viral Video: ఇలా జరుగుతుందని ముందే తెలిసుంటే.. టోల్‌గేట్ డ్యూటీ కూడా చేసేవాడు కాదేమో.. ఇంతకీ అసలేమైందో మీరే చూడండి..

ABN , First Publish Date - 2023-09-29T21:58:26+05:30 IST

హైవే రోడ్లలో ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో.. ప్రమాదాలు కూడా అంతే స్థాయిలో జరుగుతుంటాయి. మరోవైపు అడుగడుగునా టోల్‪‌గేట్‌లు తారసపడుతూ వాహనాల వేగానికి బ్రేకులు వేస్తుంటాయి. ఇది చాలా మంది డ్రైవర్లకు చికాకు తెప్పిస్తుంటుంది. ఇదిలావుండగా...

Viral Video: ఇలా జరుగుతుందని ముందే తెలిసుంటే.. టోల్‌గేట్ డ్యూటీ కూడా చేసేవాడు కాదేమో.. ఇంతకీ అసలేమైందో మీరే చూడండి..

హైవే రోడ్లలో ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో.. ప్రమాదాలు కూడా అంతే స్థాయిలో జరుగుతుంటాయి. మరోవైపు అడుగడుగునా టోల్‪‌గేట్‌లు తారసపడుతూ వాహనాల వేగానికి బ్రేకులు వేస్తుంటాయి. ఇది చాలా మంది డ్రైవర్లకు చికాకు తెప్పిస్తుంటుంది. ఇదిలావుండగా, కొందరు డ్రైవర్లు టోల్‪‌గేట్‌ ఫీజు కట్టకుండా ఉండేందుకు పక్కదారులు వెతుకుతుంటారు. ఇంకొందరు డ్రైవర్లు టోల్‪‌గేట్‌ సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతుంటారు. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ హైవేపై వెళ్తున్న ట్రక్కు డ్రైవర్‌కు (Truck driver) ఎదురుగా టోల్‪‌గేట్‌ కనిపించింది. టోల్ ఫీజు చెల్లించి వెళ్లాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. టోల్‪‌గేట్‌ వద్ద ఆపినట్లే ఆపి వాహనాన్ని ముందుకు కదిలించాడు. దీంతో టోల్ గేట్ సిబ్బంది (Toll gate staff) బండిని ఆపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో డ్రైవర్ డోరు పక్క నుంచి లోపలికి ఎక్కే ప్రయత్నం చేశాడు. అప్పటికే కోపంతో ఉన్న ట్రక్కు డ్రైవర్.. వాహనాన్ని ఆపకుండా వెళ్లాడు. దీంతో షాక్ అయిన సిబ్బంది వాహనాన్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు. ‘‘ఒరే టోల్ ఫీజు తర్వాత.. ముందు బండి ఆపురా నాయనా’’.. అని ఎన్నిసార్లు అంటూ వేడుకున్నాడు.

Mother: చుట్టూ చీకటి.. రోడ్డు పక్కన తల్లి మృతదేహం పక్కనే ఆడుకుంటున్న 8 నెలల బాబు.. అసలేం జరిగిందంటే..!

అయినా డ్రైవర్ మాత్రం వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్తున్నాడు. ఎక్కడ కిందపడతానో అనుకుంటూ అతను అలాగే భయం భయంగా వాహనాన్ని పట్టుకుని డ్రైవర్‌తో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఘటనను మొత్తం ట్రక్కులో ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో పాపం! ఈ టోల్‌గేట్ సిబ్బందికి ఎంత కష్టం వచ్చింది’’.. అని కొందరు, ‘‘ఈ డ్రైవర్ వెరైటీగా ఉన్నాడే’’.. అని మరికొందరు, ‘‘ఇంకొసారి ఇతను టోల్ ఫీజు అడగాలంటే ఎంతో ఆలోచిస్తాడు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Success Story: ఈ అమ్మాయి మాట్లాడిన ఇంగ్లీషును విని నవ్వినోళ్లే.. ఇప్పుడు ఆమె ఏ స్థాయిలో ఉందో తెలిసి షాక్..!

Updated Date - 2023-09-29T21:58:26+05:30 IST