Woman: బైక్‌పై పారిపోతున్న వ్యక్తి.. కొడవలి తీసుకుని వెంటపడిన మహిళ.. ఊహించని సీన్‌తో ఆమె ఎలా మరణించిందంటే..!

ABN , First Publish Date - 2023-09-29T21:30:12+05:30 IST

కొన్నిసార్లు ఎవరో చేసిన తప్పులకు ఇంకెవరో బలవుతుంటారు. మరికొన్నిసార్లు ఆకతాయిల రూపంలో అమాకులు మృత్యువాత పడుతుంటారు. మహిళల విషయంలో ఇలాంటి విషాద ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటుంటాయి. తాజాగా...

Woman: బైక్‌పై పారిపోతున్న వ్యక్తి.. కొడవలి తీసుకుని వెంటపడిన మహిళ.. ఊహించని సీన్‌తో ఆమె ఎలా మరణించిందంటే..!
ప్రతీకాత్మక చిత్రం

కొన్నిసార్లు ఎవరో చేసిన తప్పులకు ఇంకెవరో బలవుతుంటారు. మరికొన్నిసార్లు ఆకతాయిల రూపంలో అమాకులు మృత్యువాత పడుతుంటారు. మహిళల విషయంలో ఇలాంటి విషాద ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటుంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. బైక్‌పై పారిపోతున్న వ్యక్తిని ఓ మహిళ కొడవలి తీసుకుని వెంటపడింది. ఈ క్రమంలో ఊహించని ఘటన జరగడం వల్ల ఆమె మరణించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్‌లోని ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ఘటన చోటు చేసుకుంది. సీఆర్పీఎఫ్ రిటైర్డ్ కానిస్టేబుల్ అయిన అంకిత్ చౌదరి అనే వ్యక్తి సెప్టెంబర్ 9న ఎక్స్‌ప్రెస్ వేపై వెళ్తుండగా... రోడ్డు పక్కన ఓ మహిళ తమ పొలంలో పని చేస్తూ ఉంది. ఆమెను చూసిన అంకిత్.. బైకు ఆపి ఎదురుగా నిలబడి ప్యాంట్ జిప్ తెరచి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ పట్టరాని కోపంతో కొడవలి తీసుకుని అతన్ని వెంబడించింది. దీంతో అంకిత్ బైకుపై పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయినా వదలని మహిళ.. అతడి షర్టును పట్టుకుని వెనక్కు లాగే ప్రయత్నం చేసింది. మహిళ నుంచి విడిపించుకునే క్రమంలో ఆమెను దూరంగా నెట్టేశాడు. దీంతో సదరు మహిళ ఒక్కసారిగా రోడ్డు మీద పడింది.

Mother: చుట్టూ చీకటి.. రోడ్డు పక్కన తల్లి మృతదేహం పక్కనే ఆడుకుంటున్న 8 నెలల బాబు.. అసలేం జరిగిందంటే..!

అదే సమయంలో అటుగా వేగంగా వచ్చిన కారు (car hit the woman) ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. కారు ఆపిన డ్రైవర్ తన స్నేహితుడి సాయంతో ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్సం కోసం ఆమెను మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ (woman died while treatment) సెప్టెంబర్ 13న మృతి చెందింది. సెప్టెంబర్ 16న మృతురారి అంత్యక్రియల అనంతరం ఆమె భర్త.. చివరికి పోలీసులను ఆశ్రయించాడు.

Police: ఓ ఇంట్లోకి అదే పనిగా ఎక్కువ మంది వస్తూ ఉండటంపై స్థానికులకు డౌట్.. విషయం తెలిసి పోలీసులు సడన్‌గా సెర్చ్ చేస్తే..!

అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేశారని బాధితుడు ఆరోపించాడు. చివరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సంఘటన స్థలంలో సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. ఎట్టకేలకు నిందితుడు అంకిత్‌ను గురువారం ఇందిరాపురంలోని అతడి ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను తన తప్పు లేనట్లు చెప్పుకొచ్చాడు. బాత్రూం కోసం బైకు ఆపానని, ఆ సమయంలో వారే తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని నమ్మించే ప్రయత్నం చేశాడు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Success Story: ఈ అమ్మాయి మాట్లాడిన ఇంగ్లీషును విని నవ్వినోళ్లే.. ఇప్పుడు ఆమె ఏ స్థాయిలో ఉందో తెలిసి షాక్..!

Updated Date - 2023-09-29T21:30:12+05:30 IST