Viral Video: బాయ్‌ఫ్రెండ్‌కి మెసేజ్ చేస్తూ దొరికిపోయిన భార్య.. తప్పని చెప్పాల్సింది పోయి.. ఏకంగా భర్తకే వార్నింగ్ ఇస్తూ..

ABN , First Publish Date - 2023-05-14T15:38:38+05:30 IST

దంపతుల మధ్య రోజూ ఏదో ఒక విషయంలో గొడవలు తలెత్తడం.. కాసేపటికి సర్దుకుపోవడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు మాత్రం ఈ గొడవలు తారాస్థాయికి చేరుకుంటుంటాయి. ప్రధానంగా వివాహేతర సంబంధాల విషయంలో తలెత్తే గొడవలు.. చివరకు..

Viral Video: బాయ్‌ఫ్రెండ్‌కి మెసేజ్ చేస్తూ దొరికిపోయిన భార్య.. తప్పని చెప్పాల్సింది పోయి.. ఏకంగా భర్తకే వార్నింగ్ ఇస్తూ..

దంపతుల మధ్య రోజూ ఏదో ఒక విషయంలో గొడవలు తలెత్తడం.. కాసేపటికి సర్దుకుపోవడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు మాత్రం ఈ గొడవలు తారాస్థాయికి చేరుకుంటుంటాయి. ప్రధానంగా వివాహేతర సంబంధాల విషయంలో తలెత్తే గొడవలు.. చివరకు దాడులు, హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తుంటాయి. కొందరు మొదట తప్పులు చేసినా చివరకు పశ్చాత్తాపం చెంది.. సక్రమ మార్గంలో నడుస్తుంటారు. మరికొందరు తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ జీవితమంతా చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో భార్యాభర్తలకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ బాయ్‌ఫ్రెండ్‌కి మెసేజ్ చేస్తూ భర్తకు దొరికిపోయింది. తప్పని చెప్పాల్సింది పోయి.. చివరకు భర్తకే వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral video) అవుతోంది. ఓ మహిళ గదిలో ఓ మూల కూర్చుని తన బాయ్ ఫ్రెండ్‌కి మెసేజ్ (Wife texting boyfriend) చేస్తూ ఉంటుంది. అయితే కాసేపటి తర్వాత ఊహించని ఘటన చోటు చేసుకుంది. తన భార్య నిర్వాకాన్ని పసిగట్టిన భర్త.. ఆమె చేసిన తప్పు పది మందికీ తెలియాలనే ఉద్దేశంతో వీడియో (Video) తీసుకుంటూ ఆమె వద్దకు వెళ్తాడు. ఎందుకిలా నన్ను మోసం చేస్తున్నావ్! అని ప్రశ్నించడంతో భార్యకు కోపం కట్టలు తెంచుకుంటుంది. తన తప్పును ఒప్పుకోవాల్సింది పోయి.. (wife warning to her husband) తిరిగి భర్తకే వార్నింగ్ ఇస్తుంది.

Viral Video: ఈ ఆవు నిజంగా గోమాతే.. పిల్లాడి వద్దకు వచ్చి ఏం చేసిందో చూడండి..

ఆగ్రహించిన ఆమె భర్తతో.. ‘‘మీ కుటుంబం ప్రజల సొమ్ము తిని బతికింది.. నా పుట్టింటి వారు చాలా ధనవంతులు.. నువ్వు లేకున్నా కూడా చాలా హ్యాపీగా జీవించగలను’’.. ఇలా సంబంధం లేకుండా మాట్లాడుతూ భర్తను హెచ్చరిస్తుంది. భార్య వింత ప్రవర్తన చూసి భర్త షాక్ అవుతాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఆమె పద్ధతి సరిగా లేదు’’.. అని కొందరు, ‘‘క్షమాపణ చెప్పాల్సింది పోయి.. ఇలా మాట్లాడటం సరికాదు’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి తప్పులు ఎవరూ చేయొద్దు’’ అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రియుడితో ఉన్న భార్య వద్దకు సడన్‌గా వెళ్లిన భర్త.. వీడియో తీస్తుండగా.. చిరాకుపడుతూ ఆమె చెప్పిన సమాధానం..

Updated Date - 2023-05-14T15:38:38+05:30 IST