Viral Video: బైకుపై వచ్చిన దొంగలు.. యువతీయువకులను బెదిరించి దోచుకున్నారు.. అయితే ఆ మరుక్షణమే ఏం జరిగిందో చూస్తే..

ABN , First Publish Date - 2023-05-14T18:00:14+05:30 IST

ఇటీవల మనుషుల్లో నేర ప్రవర్తన బాగా పెరిగిపోయింది. పట్టపగలు యువతులపై దాడులు చేసేవారు కొందరైతే.. ఇంకొందరు డబ్బుల కోసం ఎంతకు తెగించడానికైనా సిద్ధపడుతున్నారు. తప్పులు చేసిన వారు శిక్ష అనుభవించాలంటే ఒకప్పుడు చాలా సమయంలో పట్టేదేమో గానీ.. ప్రస్తుతం..

Viral Video: బైకుపై వచ్చిన దొంగలు.. యువతీయువకులను బెదిరించి దోచుకున్నారు.. అయితే ఆ మరుక్షణమే ఏం జరిగిందో చూస్తే..

ఇటీవల మనుషుల్లో నేర ప్రవర్తన బాగా పెరిగిపోయింది. పట్టపగలు యువతులపై దాడులు చేసేవారు కొందరైతే.. ఇంకొందరు డబ్బుల కోసం ఎంతకు తెగించడానికైనా సిద్ధపడుతున్నారు. తప్పులు చేసిన వారు శిక్ష అనుభవించాలంటే ఒకప్పుడు చాలా సమయంలో పట్టేదేమో గానీ.. ప్రస్తుతం వెంట వెంటనే తగిన గుణపాఠం నేర్చుకుంటున్నారు. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఇద్దరు దొంగలు బైకుపై వచ్చి యువతీయువకులను బెదిరించి దోచుకున్నారు. అయితే ఆ మరుక్షణమే జరిగిన ఘటన చూసి.. తగిన శాస్తి జరిగిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral video) అవుతోంది. కొందరు యువతీయువకులు రాత్రి వేళ్ల రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు. నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి వారికి ఎదురుగా ఆపుతారు. బైకు దిగి వారి వద్దకు వెళ్లి కత్తులతో బెదిరించి (Thieves robbed young men and women) మరీ నగదు, నగలు దోచుకుంటారు. వీరిని చూడగానే వారంతా భయంతో మిన్నకుండిపోతారు. వెంటనే వారి అడిగింది ఇచ్చేస్తారు. తర్వాత ఇద్దరు దొంగలు బైకు ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నిస్తారు. అయితై ఇలా బైకు ఎక్కి.. అలా కదిలించగానే వెనుక నుంచి ఓ కారు (car hit a bike) అత్యంత వేగంతో వచ్చి బైకును ఢీకొంటుంది.

Viral Video: నిద్రపోతున్న తల్లి పక్కన.. దుప్పటి కప్పుకొని ఏదో చెయ్యాలనుకుంది.. చివరికి ఏమైందో మీరే చూడండి..

ఈ ప్రమాదంలో బైకుతో పాటూ ఇద్దరు దొంగలూ ఎగిరి దూరంగా పడిపోతారు. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో పక్కనే ఉన్న యువతీయువకులు షాక్‌కు గురై.. పక్కకు పరుగెత్తుకుంటూ వెళ్తారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నేరాలు చేసిన ప్రతి ఒక్కరికీ ఇలాగే జరగాలి’’.. అని కొందరు, ‘‘వామ్మో! ఈ వీడియో చూస్తే.. తప్పు చేయాలంటేనే భయపడతారు’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రియుడితో ఉన్న భార్య వద్దకు సడన్‌గా వెళ్లిన భర్త.. వీడియో తీస్తుండగా.. చిరాకుపడుతూ ఆమె చెప్పిన సమాధానం..

Updated Date - 2023-05-14T18:00:14+05:30 IST