Viral News: వామ్మో.. ఆగస్టు 14వ తారీఖే అందరికీ జ్వరం వచ్చేస్తోందట.. ప్రైవేటు ఉద్యోగుల వింత సాకుల వెనుక..!

ABN , First Publish Date - 2023-08-11T17:00:06+05:30 IST

సెలవు రోజు వస్తోందంటే విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ అందరికీ ఎక్కడ లేని ఆనందం కలుగుతుంటుంది. ఇక సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైతే వారంలో శని, ఆదివారాలు సెలవు ఉండడంతో వీకెండ్ పేరుతో ఎంజాయ్ చేస్తుంటారు. అసలీ ప్రస్తావన ఇప్పుడు ఎందుకొచ్చిందంటే.. ఈ ఏడాది ..

Viral News: వామ్మో.. ఆగస్టు 14వ తారీఖే అందరికీ జ్వరం వచ్చేస్తోందట.. ప్రైవేటు ఉద్యోగుల వింత సాకుల వెనుక..!

సెలవు రోజు వస్తోందంటే విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ అందరికీ ఎక్కడ లేని ఆనందం కలుగుతుంటుంది. ఇక సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైతే వారంలో శని, ఆదివారాలు సెలవు ఉండడంతో వీకెండ్ పేరుతో ఎంజాయ్ చేస్తుంటారు. అసలీ ప్రస్తావన ఇప్పుడు ఎందుకొచ్చిందంటే.. ఈ ఏడాది ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజైన 14న ప్రైవేటు ఉద్యోగులందరికీ జ్వరం వచ్చేస్తుందట. 14న ఒక్కరోజు సెలవు పెట్టడానికి వెనుక గల కారణాలు తెలసుకుని నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టుకు సంబంధించిన వార్త తెగ వైరల్ (Viral news) అవుతోంది. చాలా మంది ప్రవేట్ సంస్థల ఉద్యోగులకు (private companies Employees) ఓ వింత ఆలోచన వచ్చింది. ఆగస్టు 15న జాతీయ సెలవు దినం (National holiday) అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా కొందరు ఉద్యోగులు మాస్టర్ ప్లాన్ వేశారు. ఆగస్టు 15 మంగళవారం ఎలాగూ సెలవు కాబట్టి.. దానికి ముందు వచ్చే సోమవారం సెలవు పెడితే ఎలా ఉంటుందంటూ వింత ఆలోచనను తెరపైకి తెచ్చారు. ఆగస్టు 12వ తేదీ శనివారం, 13వ తేదీ ఆదివారం, 14వ తేదీ సోమవారం, 15వ తేదీ జాతీయ సెలవుదినం. ఈ లెక్కన 14న సిక్ లీవ్‌కు ప్లాన్ చేసుకుంటే.. నాలుగు రోజులు సెలవులు కలిసి వస్తాయి కదా! అని అంటూ కొందరు ఈ చర్చను తెరపైకి తెచ్చారు.

Viral Video: వావ్.. ఈ పిల్లాడి టెక్నిక్ మామూలుగా లేదుగా.. చేపలు పట్టడం ఇంత సింపులా..?

ఇక ఆగస్టు 16న పార్సీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎవరికైనా సెలవు కానీ లభిస్తే.. వరుసగా ఐదు రోజుల పాటు సెలవులే సెలవులు అంటూ ఉద్యోగుల్లో ఆసక్తిని రేకెత్తించారు. అయితే ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. సెలవు మంజూరైన వారు.. ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మంజూరు కాని వారు విచారం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఐడియా.. బాగుంది కానీ మా బాస్ ఒప్పుకోలేదే’’.. అంటూ కొందరు, ‘‘యాహూ!!.. నాకు సెలవు దొరికిందోచ్’’.. అంటూ ఇంకొందరు, ‘‘ఈ సెలవు కోసం పది రోజుల ముందే ప్లాన్ చేసుకున్నాం’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వార్త మాత్రం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

Viral News: జాబ్‌లో చేరిన మొదటి రోజే రిజైన్‌ లెటర్ ఇచ్చిన కుర్రాడు.. కారణం అడిగితే చెప్పిన సమాధానం విని బాస్‌కు షాక్..!

Updated Date - 2023-08-11T17:00:06+05:30 IST