Viral Video: వావ్.. ఈ పిల్లాడి టెక్నిక్ మామూలుగా లేదుగా.. చేపలు పట్టడం ఇంత సింపులా..?

ABN , First Publish Date - 2023-08-11T15:05:28+05:30 IST

పెద్దలే కాదు అప్పుడప్పుడూ చాలా మంది చిన్న పిల్లలు కూడా ఎంతో తెలివిగా ప్రవర్తిస్తుంటారు. కొందరు ఆటల్లో, మరికొందరు చదువులో ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి పిల్లల వీడియోలు...

Viral Video: వావ్.. ఈ పిల్లాడి టెక్నిక్ మామూలుగా లేదుగా.. చేపలు పట్టడం ఇంత సింపులా..?

పెద్దలే కాదు అప్పుడప్పుడూ చాలా మంది చిన్న పిల్లలు కూడా ఎంతో తెలివిగా ప్రవర్తిస్తుంటారు. కొందరు ఆటల్లో, మరికొందరు చదువులో ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి పిల్లల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ పిల్లాడికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చేపలు పట్టడానికి ఈ బుడ్డోడు ఉపయోగించిన టెక్నిక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘‘ఓహ్! చేపలు పట్టడం ఇంత సింపులా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ పిల్లాడు చేపలు (Boy fishing) పట్టేందుకు ఓ సులభమైన టెక్నిక్ వాడాడు. ఇందుకోసం రెండు చెక్క కర్రలను తీసుకుని, వాటికి మధ్యలో ఓ చక్రానికి ఎరను కట్టిన దారపు చుట్టను ఏర్పాటు చేస్తాడు. అనంతరం ఓ నది ఒడ్డున చెక్క కర్రలను సుత్తితో గట్టిగా కొట్టి కదలకుండా లోతుగా పాతేస్తాడు. చివరగా ఎరకు చపాతీ పిండిని అతికించి నీటిలోకి విసిరేస్తాడు. తర్వాత చాలా సేపు నది ఒడ్డునే ఓపిగ్గా వేచి చూస్తాడు. ఎరకు చేపలు చిక్కగానే చెక్క కర్రల మధ్య ఏర్పాటు చేసిన చక్రం గిర్రున తిరుగుతుంది.

Viral News: జాబ్‌లో చేరిన మొదటి రోజే రిజైన్‌ లెటర్ ఇచ్చిన కుర్రాడు.. కారణం అడిగితే చెప్పిన సమాధానం విని బాస్‌కు షాక్..!

చేపలు పడ్డాయని తెలియగానే.. బుడ్డోడు కంగారుగా పైకి లేచి, దారాన్ని గట్టిగా బయటికి లాగేస్తాడు. చివరకు చూడగా ఎరకు రెండు పెద్ద చేపలు చిక్కుకుని ఉంటాయి. ఎంతో సంతోషంగా వాటిని తీసుకుని సంచిలో వేసుకుంటాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ బుడ్డోడు తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ టెక్నిక్ ఏదో చాలా బాగుందే’’.. అంటూ మరికొందరు, ‘‘అంత పెద్ద చేపలను ఎంత సింపుల్‌గా పట్టేశాడు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నీ తెలివి ముందు ఇంజనీర్లు కూడా సరిపోరు బాసూ.. బైక్‌ను కారుగా ఎలా మార్చేశాడో చూస్తే..!

Updated Date - 2023-08-11T15:05:28+05:30 IST