Viral News: జాబ్‌లో చేరిన మొదటి రోజే రిజైన్‌ లెటర్ ఇచ్చిన కుర్రాడు.. కారణం అడిగితే చెప్పిన సమాధానం విని బాస్‌కు షాక్..!

ABN , First Publish Date - 2023-08-10T21:00:21+05:30 IST

యువతీయువకులు తమ చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగాల వేటలో పడిపోతుంటారు. అయితే కొందరికి వెను వెంటనే మంచి మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తే.. మరికొందరు ఏళ్ల తరబడి ఎదురు చూసినా సరైన ఉద్యోగం దొరకదు. ఈ క్రమంలో చివరకు అందుబాటులో ఉన్న ఏదో పని చేస్తూ...

Viral News: జాబ్‌లో చేరిన మొదటి రోజే రిజైన్‌ లెటర్ ఇచ్చిన కుర్రాడు.. కారణం అడిగితే చెప్పిన సమాధానం విని బాస్‌కు షాక్..!
ప్రతీకాత్మక చిత్రం

యువతీయువకులు తమ చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగాల వేటలో పడిపోతుంటారు. అయితే కొందరికి వెను వెంటనే మంచి మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తే.. మరికొందరు ఏళ్ల తరబడి ఎదురు చూసినా సరైన ఉద్యోగం దొరకదు. ఈ క్రమంలో చివరకు అందుబాటులో ఉన్న ఏదో పని చేస్తూ కాలం వెళ్లదీస్తుంటారు. మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన వారెవరూ.. వాటిని వదులుకునేందుకు అస్సలు ఇష్టపడరు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తికి జాబ్‌లో చేరిన మొదటి రోజే రిజైన్ చేసి వెళ్లిపోయాడు. కారణం అడగ్గా.. అతడు చెప్పిన సమాధానం విని బాస్ షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే..

న్యూఢిల్లీకి (New Delhi) చెందిన ఓ వ్యక్తికి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అందులోనూ మొట్టమొదటి జాబ్ కావడంతో ఎంతో ఉత్సాహంగా ఆఫీసుకు వెళ్లాడు. అయితే ఆఫీసుకు వెళ్లగానే తన మనసు వెంటనే మార్చుకున్నాడు. వెంటనే తన బాస్ వద్దకు వెళ్లి.. (Man resigned from the job) తాను రిజైన్ చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో అవాక్కైన బాస్.. ‘‘ఏంటిది! చేరిన మొదటిరోజే రిజైన్ అంటున్నావ్.. ఏంటీ కామెండీ చేస్తున్నావా’’.. అని ప్రశ్నించాడు. ఇందుకు సదరు ఉద్యోగి చెప్పిన కారణం విని చివరకు షాక్ అయ్యాడు. తాను వాయువ్య ఢిల్లీలోని పింక్ లైన్ ప్రాంతంలో ఉంటున్నానని, ఆఫీసేమో మౌల్సారి అరెన్యూ ప్రాంతంలో ఉందని చెప్పాడు. ఇంటి నుంచి రావాలంటే చాలా సమయం పడుతుండడంతో రిజైన్ చేస్తున్నట్లు చెప్పాడు. ఈ కారణం విని ఉద్యోగులు కూడా అవాక్కయ్యారు.

Viral Video: వామ్మో! ఇదెక్కడి విడ్డూరం.. నేలపై సిమెంట్‌ను బద్దలుకొట్టగా.. అడుగున షాకింగ్ దృశ్యం.. నీళ్లలో ఉండాల్సినవి కాస్తా..

తనకు రాకపోకలకు సుమారు రూ.5వేలు ఖర్చు అవుతోందని, అందులోనూ ఆఫీసుకు కేటాయించే సమయం పోనూ ఇంట్లో ఉండేందుకు కేవలం మూడు గంటలు మాత్రమే సమయం దొరుకుతోందని చెప్పాడు. ఇది తనకు ఇష్టం లేదని, అలాగని తనకు వేరే ఇల్లు మారే ఉద్దేశం కూడా లేదన్నాడు. తన సమస్యను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బ్రదర్.. ఇది చాలా తెలివితక్కువ నిర్ణయం’’, ‘‘ఉద్యోగం కావాలనుకుంటే ఇల్లు మారాలి’’, ‘‘ఇలాంటి సిల్లీ కారణంతో ఉద్యోగం మానేయడం ఎక్కడా చూల్లేదు’’.. అంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. నెటిజన్ల కామెంట్లు చూశాక.. సదరు ఉద్యోగి తన నిర్ణయానికి చింతిస్తూ సమాధానం ఇచ్చాడు. తనకు ఆ సమయంలో సలహాలు ఇచ్చే వారు ఎవరూ లేరని, అనవసరంగా పెద్ద తప్పు చేశానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, వార్త (Viral news) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Viral Video: నీ తెలివి ముందు ఇంజనీర్లు కూడా సరిపోరు బాసూ.. బైక్‌ను కారుగా ఎలా మార్చేశాడో చూస్తే..!

Updated Date - 2023-08-10T21:02:51+05:30 IST