Gas Cylinder: ఈ పోలీస్‌కు హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే.. గ్యాస్ సిలిండర్ లీకై మంటలు ఎగిసిపడుతోంటే.. ఎలా ఆపేశాడో చూస్తే..!

ABN , First Publish Date - 2023-08-10T17:54:57+05:30 IST

అగ్ని ప్రమాదాలు కొన్నిసార్లు అనూహ్యంగా చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సందర్భాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన సందర్భాలను చాలా చూశాం. అలాగే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి చాలా వరకు ప్రమాదాలను అరికట్టడం కూడా చూస్తూ ఉంటాం. వారి ప్రాణాలను సైతం..

Gas Cylinder: ఈ పోలీస్‌కు హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే.. గ్యాస్ సిలిండర్ లీకై మంటలు ఎగిసిపడుతోంటే.. ఎలా ఆపేశాడో చూస్తే..!

అగ్ని ప్రమాదాలు కొన్నిసార్లు అనూహ్యంగా చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సందర్భాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన సందర్భాలను చాలా చూశాం. అలాగే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి చాలా వరకు ప్రమాదాలను అరికట్టడం కూడా చూస్తూ ఉంటాం. వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి బాధితులను రక్షిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. గ్యాస్ సిలిండర్ లీకై మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఓ పోలీసు కానిస్టేబుల్ సడన్‌గా వచ్చి ఎలా ఆపేశాడో చూడండి..

సోషల్ మీడియాలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) చంబల్‌లోని భింద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సర్సాయిపురాలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ (Fire from gas cylinder) లీకవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ ఇంట్లోని వారు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న భింద్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారిలో ఓ కానిస్టేబుల్ (Constable) మంటలు ఆపే క్రమంలో తెలివిగా వ్యవహరించాడు. ముందుగా అతను మంటలను ఆర్పేందుకు గోనె సంచులతో ప్రయత్నించాడు.

Shocking: ఏడాదిన్నర వయసున్న పాప.. ఎంతకూ ఏడుపు ఆపడం లేదని ఆ తల్లి చేసిన నిర్వాకమిదీ.. పాల బాటిల్‌లో..!

అయినా మంటలు తగ్గకపోవడంతో చివరికి ఇంకో ట్రిక్ ఉపయోగించాడు. ముందుగా ఓ పొడవాటి కర్రతో సిలిండర్ రెగ్యులేటర్‌ స్విచ్‌ను ఆఫ్ చేయాలని చూశాడు. అదీ కుదరకపోవడంతో ఫైనల్‌గా సిలిండర్‌పై నీళ్లు పోసి, చేత్తో పట్టుకుని పైకి నిలబెట్టాడు. తర్వాత సిలిండర్‌పై మరో బకెట్ నీళ్లు పోసి.. చివరగా రెగ్యులేటర్‌ స్విచ్‌ను ఆఫ్ చేశాడు. మంటలు ఆగిపోవడంతో అక్కడున్న వారంతా హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి ప్రమాదాన్ని నివారించిన పోలీసు సిబ్బందిని అంతా అభినందించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో! ఇదెక్కడి విడ్డూరం.. నేలపై సిమెంట్‌ను బద్దలుకొట్టగా.. అడుగున షాకింగ్ దృశ్యం.. నీళ్లలో ఉండాల్సినవి కాస్తా..

Updated Date - 2023-08-10T17:54:57+05:30 IST