Viral video: బోగీలో యువతి ప్రవర్తన చూసి బిత్తరపోయిన ప్రయాణికులు.. స్టేషన్‌లో రైలు ఆగగానే.. ఏం చేసిందో చూడండి..

ABN , First Publish Date - 2023-07-09T18:09:13+05:30 IST

యువతీయువకులకు ఇటీవల రీల్స్ పిచ్చి ఎక్కువైంది. ఏదోటి చేసి ఎలాగైనా వైరల్ అవ్వాలని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. కొందరు యువతులు చేసే పనులు కొన్నిసార్లు జనాలకు ఆగ్రహం తెప్పిస్తుంటాయి. రద్దీ ప్రాంతాల్లో ప్రాంక్‌లు చేసే వారు కొందరైతే..

Viral video: బోగీలో యువతి ప్రవర్తన చూసి బిత్తరపోయిన ప్రయాణికులు.. స్టేషన్‌లో రైలు ఆగగానే.. ఏం చేసిందో చూడండి..

యువతీయువకులకు ఇటీవల రీల్స్ పిచ్చి ఎక్కువైంది. ఏదోటి చేసి ఎలాగైనా వైరల్ అవ్వాలని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. కొందరు యువతులు చేసే పనులు కొన్నిసార్లు జనాలకు ఆగ్రహం తెప్పిస్తుంటాయి. రద్దీ ప్రాంతాల్లో ప్రాంక్‌లు చేసే వారు కొందరైతే.. ఇంకొందరు తోటి మహిళలతో గొడవపడుతూ రభస సృష్టిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, మెట్రో రైల్లో ఓ యువతి నిర్వాకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మెట్రో రైలు స్టేషన్‌లో ఆగగానే ఓ యువతి ప్రవర్తన చూసి.. ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు..

ఢిల్లీ మెట్రో రైల్లో (Delhi Metro Rail) ఓ యువతి నిర్వాకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టేషన్ వద్ద రైలు ఆగగానే ప్రయాణికులంతా ఎక్కి, దిగే క్రమంలో హడావుడిగా ఉంటారు. ఈ క్రమంలో ఓ యువతి సడన్‌గా (young woman danced on the train) డాన్స్ చేయడం మొదలెడుతుంది. అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న యువతి.. ఒక్కసారిగా ఇలా డాన్సులు వేయడం చూసి అక్కడున్న వారంతా షాక్ అవుతున్నారు. యువతి బోగీ లోపలి నుంచి డాన్స్ వేస్తూనే ప్లాట్‌ఫామ్ మీదకు దిగుతుంది.

Viral: చెల్లి దిష్టిబొమ్మను పాడెపై పడుకోబెట్టి.. చనిపోయిందంటూ ఊరేగించి.. ఇంట్లోని దుస్తులన్నిటినీ తెచ్చి చితిగా పేర్చి..!

అలాగే డాన్స్ వేసుకుంటూ ప్లాట్‌ఫామ్‌పై అటూ ఇటూ తిరుగుతుంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొంతమంది మహిళలు.. యువతి ప్రవర్తన చూసి దూరంగా వెళ్లిపోతారు. పక్కన బోగీ వద్దకు వెళ్లి స్టెప్పులు వేయడంతో లోపల ఉన్న ఓ వ్యక్తి.. ‘‘ఈమెకు ఇదేం పిచ్చిరా నాయానా’’.. అనుకుంటూ పక్కకు వెళ్లిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రీల్స్ కోసం మరీ ఇలా తయారవుతున్నారేంట్రా బాబూ’’.. అని కొందరు, ‘‘యువతి డాన్స్ సూపర్’’.. అంటూ మరికొందరు, ‘‘ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం సరికాదు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: వామ్మో! ఇదెక్కడి గాడిదరా బాబోయ్.. అంత మంది అదిలిస్తున్నా ఇంచు కూడా కదలకండా.. చివరకు ఎంత పని చేసింది..

Updated Date - 2023-07-09T18:09:13+05:30 IST