Big Twist: ప్రశాంత్ అని పేరు మార్చుకుని ఏపీలో 15 ఏళ్లుగా నివాసం.. యూపీలో అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిసి ఉలిక్కిపడ్డ జనం..!

ABN , First Publish Date - 2023-07-08T17:28:38+05:30 IST

పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నేరస్థుల తెలివితేటలు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. పెద్ద పెద్ద నేరాలు చేసినా.. పైకి మాత్రం ఏమీ తెలీని అమాయకుల్లా నటిస్తుంటారు. ఈ క్రమంలో సినిమా స్క్రీన్ ప్లేను తలదన్నేలా వారి మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఇలాంటి ..

Big Twist: ప్రశాంత్ అని పేరు మార్చుకుని ఏపీలో 15 ఏళ్లుగా నివాసం.. యూపీలో అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిసి ఉలిక్కిపడ్డ జనం..!

పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నేరస్థుల తెలివితేటలు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. పెద్ద పెద్ద నేరాలు చేసినా.. పైకి మాత్రం ఏమీ తెలీని అమాయకుల్లా నటిస్తుంటారు. ఈ క్రమంలో సినిమా స్క్రీన్ ప్లేను తలదన్నేలా వారి మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఇలాంటి నేరాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రశాంత్ అని పేరు మార్చుకుని ఏపీలో 15 ఏళ్లుగా నివాసం ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీలో ఇతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసుకుని జనం ఉలిక్కిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కొత్వాలి జిల్లా సహర్‌స్పలి పోలీస్ స్టేషన్ పరిధి బల్లియా ప్రాంతానికి చెందిన చోటే అనియాస్ ఛోటక్ కహర్ అనే 45 ఏళ్ల వ్యక్తి.. 2008 నుంచి ప్రశాంత్ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఇతన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీలో అతడి చేసిన నిర్వాకం గురించి తెలుసుకున్న ప్రజలు షాక్ అవుతున్నారు. సదర్ కొత్వాలి జిల్లాలో 2008లో ఓ వ్యక్తి హత్య చేయబడ్డాడు. ఈ కేసులో (main accused) చోటే ప్రధాన నిందితుడు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. తర్వాత ప్రశాంత్ అనే పేరుతో ఏపీలో స్థిరపడ్డాడు. 15ఏళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా నెట్టుకొచ్చాడు. చోటేపై 2009లో కేసు నమోదైంది.

Viral: చెల్లి దిష్టిబొమ్మను పాడెపై పడుకోబెట్టి.. చనిపోయిందంటూ ఊరేగించి.. ఇంట్లోని దుస్తులన్నిటినీ తెచ్చి చితిగా పేర్చి..!

అనంతరం అతడిపై రూ.25,000ల రివార్డు కూడా ప్రకటించారు. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, జైలుకు తరలించారు. ఇదిలావుండగా, ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ప్రభుత్వం నేరస్థులపై నిఘా ఉంచిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలెర్ట్ అయ్యారు. పాత నేరస్థుల వివరాలు తీసుకుని, వారి కార్యకలాపాలపై దృష్టి పెడుతున్నారు. అలాగే పరారీలో ఉన్న వారి కోసం రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలతో పాటూ చుట్టు పక్కల రాష్ట్రాలను కూడా జల్లెడ పడుతున్నారు. కాగా, చోటే అనియాస్ ఛోటక్ కహర్ అరెస్ట్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral video: మా అమ్మకు దక్కిన అత్యున్నత పురస్కారం.. అంటూ కూతురు పెట్టిన వీడియో చూస్తే..

Updated Date - 2023-07-08T17:28:38+05:30 IST