Viral video: వామ్మో! ఇదెక్కడి గాడిదరా బాబోయ్.. అంత మంది అదిలిస్తున్నా ఇంచు కూడా కదలకండా.. చివరకు ఎంత పని చేసింది..

ABN , First Publish Date - 2023-07-09T16:35:36+05:30 IST

క్రూర జంతువులు మినహా మిగతా జంతువులేవీ మనుషులపై దాడి చేసేందుకు సాహసించవు.. పైగా మనుషులే వాటిపై అకారణంగా దాడి చేసి హింసిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అదే జంతువులు ఎదురు దాడి చేస్తుంటాయి. ఇటీవల ఓ యువకుడు గాడిదను అకారణంగా హింసించడంతో..

Viral video: వామ్మో! ఇదెక్కడి గాడిదరా బాబోయ్.. అంత మంది అదిలిస్తున్నా ఇంచు కూడా కదలకండా.. చివరకు ఎంత పని చేసింది..

క్రూర జంతువులు మినహా మిగతా జంతువులేవీ మనుషులపై దాడి చేసేందుకు సాహసించవు.. పైగా మనుషులే వాటిపై అకారణంగా దాడి చేసి హింసిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అదే జంతువులు ఎదురు దాడి చేస్తుంటాయి. ఇటీవల ఓ యువకుడు గాడిదను అకారణంగా హింసించడంతో.. దానికి కోపం వచ్చి సదరు వ్యక్తికి చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఓ వృద్ధుడు తన మానాన తాను నడుచుకుంటూ వెళ్తుంటే.. ఉన్నట్టుండి ఓ గాడిద దాడి చేసింది. చాలా మంది చుట్టూ చేరి అదిలించినా.. పట్టించుకోకుండా చివరకు దారుణానికి తెగబడింది..

సోషల్ మీడియాలో వృద్ధుడిపై గాడిద దాడి చేసిన వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తెల్లటి దుస్తులు ధరించిన వృద్ధుడు (old man) గొడుగు పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటాడు. అదే సమయంలో రోడ్డు పక్కన ఓ గాడిద నిలబడి ఉంటుంది. సమీపంలోకి వచ్చిన వృద్ధుడిని చూడగానే గాడిదకు కోపం కట్టలు తెంచుకుంటుంది. దాన్ని ఏమీ అనకున్నా ఆశ్చర్యకరంగా ఉన్నట్టుండి వృద్ధుడిపై (Donkey attack old man) దాడికి దిగుతుంది. దీంతో అతను ఒక్కసారిగా కిందపడిపోతాడు. తర్వాత వృద్ధుడి కాలును గట్టిగా అదిమిపట్టి కొరికే ప్రయత్నం చేస్తుంది. దాన్నుంచి తప్పించుకునేందుకు వృద్ధుడు శతవిధాలా ప్రయత్నిస్తాడు. కానీ సాధ్యం కాక గట్టిగా కేకలు పెడతాడు. అంతలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి గాడితను కాలితో తన్నుతూ అదిలించే ప్రయత్నం చేస్తాడు.

Viral video: హంసపై దాడి చేసిన పులి.. తీరా దగ్గరికి వెళ్లాక సీన్ రివర్స్.. చివరికి ఏమైందో చూడండి..

అయినా గాడిద ఏమాత్రం లెక్కచేయకుండా వృద్ధుడి కాలిని పట్టుకుని ఉంటుంది. అదే సమయంలో స్కూటీపై వచ్చిన వ్యక్తి.. బండి ఆపి పరుగు పరుగున వచ్చి బెల్టుతో గాడిదను కొడతాడు. ఇద్దరూ ఎంత అదిలించినా గాడిద మాత్రం కొంచెం కూడా కదలదు. అంతలో కారులో వచ్చిన కొందరు.. గాడిద పైకి రాళ్లు విసురుతారు. అంతమంది కొడుతున్నా గాడిద మాత్రం వృద్ధుడిని వదలకపోవడం చూసి అంతా షాక్ అవుతారు. కొంత మంది దాని వద్దకు వచ్చేందుకు కూడా భయపడి దూరంగా నిలబడిపోతారు. చివరగా మరో వ్యక్తి పెద్ద కర్ర తీసుకుని గాడిదను బలంగా కొడతాడు. దీంతో దెబ్బకు గాడిద వృద్ధుడిని వదిలి పారిపోతుంది. ఈ దాడిలో వృద్ధుడి కాలికి రక్తగాయాలైనట్లు (Injuries) తెలుస్తోంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Viral: చెల్లి దిష్టిబొమ్మను పాడెపై పడుకోబెట్టి.. చనిపోయిందంటూ ఊరేగించి.. ఇంట్లోని దుస్తులన్నిటినీ తెచ్చి చితిగా పేర్చి..!

Updated Date - 2023-07-09T16:35:36+05:30 IST