Viral video: ఇది ఇంగ్లీష్ నేర్చిన కుక్క.. యజమాని పెట్టిన పరీక్షలో ఎలా నెగ్గిందో చూడండి..

ABN , First Publish Date - 2023-07-08T20:10:58+05:30 IST

పెంపుడు కుక్కల తెలివితేటలు, యజమానుల పట్ల అవి చూపించే ప్రేమ ఎలా ఉంటుందో రోజూ చూస్తూనే ఉంటాం. ఇక ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన కుక్కలు.. యజమాని ఇలా సైగ చేయగానే అలా పసిగట్టేస్తుంటాయి. అవి చేసే పనులు చూస్తే అంతలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి..

Viral video: ఇది ఇంగ్లీష్ నేర్చిన కుక్క.. యజమాని పెట్టిన పరీక్షలో ఎలా నెగ్గిందో చూడండి..

పెంపుడు కుక్కల తెలివితేటలు, యజమానుల పట్ల అవి చూపించే ప్రేమ ఎలా ఉంటుందో రోజూ చూస్తూనే ఉంటాం. ఇక ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన కుక్కలు.. యజమాని ఇలా సైగ చేయగానే అలా పసిగట్టేస్తుంటాయి. అవి చేసే పనులు చూస్తే అంతలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుక్క తెలివి చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. యజమాని పెట్టిన పరీక్షను ఈజీగా నెగ్గిన కుక్కను చూసి.. ఇది ఇంగ్లీష్ నేర్చిన కుక్క.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో కుక్కకు సంబంధించిన వీడియో (Dog viral videos) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క తెలివితేటలకు పెద్ద పరీక్ష పెడతాడు. ముందుగా అతను ఓ సోఫాలో కూర్చుని.. ఎదురుగా ఉన్న కుక్కకు SIT అని రాసి ఉన్న పేపర్‍‌ను చూపిస్తాడు. దాన్ని చూడగానే కుక్క వెంటనే కూర్చుంటుంది. తర్వాత DOWN అని రాసి ఉన్న పేపర్‌ను చూపిస్తాడు. ‘‘ఈ మాత్రం నాకు తెలీదా’’.. అన్నట్లు ఆ కుక్క వెంటనే పూర్తిగా నేలపై పడుకుంటుంది. ఆ తర్వాత చివరగా STAND అని రాసి ఉన్న పేపర్‌ను చూపించగానే.. వెంటనే లేచి నిలబడుతుంది.

MP Urination Case: గిరిజనుడిపై మూత్ర విసర్జన కేసులో మరో ఊహించని ట్విస్ట్.. ముఖ్యమంత్రే కాళ్లు కడిగి ఇంటికి పంపించిన తర్వాత..!

ఇంగ్లీష్ అక్షరాలను కుక్క సులభంగా (dog understands English) అర్థం చేసుకోవడం చూసి.. యజమానికి ఎక్కడలేని సంతోషం కలుగుతుంది. కుక్కకు ప్రేమగా ముద్దు పెట్టి శభాష్.. అంటూ మెచ్చుకుంటాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! దీని తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇది ఇంగ్లీష్ నేర్చిన కుక్క’’.. అంటూ మరికొందరు, ‘‘స్కూల్లో జాయిన్ అవ్వడానికి దీనికి అన్ని అర్హతలూ ఉన్నాయి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: చెల్లి దిష్టిబొమ్మను పాడెపై పడుకోబెట్టి.. చనిపోయిందంటూ ఊరేగించి.. ఇంట్లోని దుస్తులన్నిటినీ తెచ్చి చితిగా పేర్చి..!

Updated Date - 2023-07-08T20:10:58+05:30 IST