MP Urination Case: గిరిజనుడిపై మూత్ర విసర్జన కేసులో మరో ఊహించని ట్విస్ట్.. ముఖ్యమంత్రే కాళ్లు కడిగి ఇంటికి పంపించిన తర్వాత..!

ABN , First Publish Date - 2023-07-08T19:06:53+05:30 IST

మధ్యప్రదేశ్‌లో గిరిజన యువకుడిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో..

MP Urination Case: గిరిజనుడిపై మూత్ర విసర్జన కేసులో మరో ఊహించని ట్విస్ట్.. ముఖ్యమంత్రే కాళ్లు కడిగి ఇంటికి పంపించిన తర్వాత..!

మధ్యప్రదేశ్‌లో గిరిజన యువకుడిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం నిందితుడిపై వివిధ సెక్షన్ల కేసులు నమోదు చేసింది. అంతేకాకుండా ఏకంగా మఖ్యమంత్రే బాధితుడిని ఇంటికి పిలిపించుకుని కాళ్లు కడిగి క్షమాపణలు తెలిపారు. అయితే ఈ కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సిద్ధి జిల్లా కుబ్రి గ్రామంలో ఆదివాసీ వ్యక్తిపై ఓ యువకుడు మూత్ర విసర్జన చేసిన (Urination on tribal man) ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవడంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీంతో ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కుబ్రి గ్రామానికి చెందిన నిందితుడు ప్రవేశ్ శుక్లాను (Pravesh Shukla) బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం శిరరాజ్ సింగ్ చౌహాన్ (CM Shirraj Singh Chouhan) .. నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) ప్రయోగించాలని ఆదేశించారు. అనంతరం నిందితుడి ఇంటిని అధికారులు బుల్డోజర్ సాయంతో కూల్చేశారు. ఈ క్రమంలోనే సీఎం గురువారం.. బాధితుడైన గిరిజన కార్మికుడు దష్మేష్ రావత్‌‌ను (Dashmesh Rawat) అధికారిక నివాసానికి పిలిపించుకుని పాదాలను కడిగాడు. అనంతరం ఆ నీళ్లను తలపై కూడా చల్లుకుని క్షమాపణలు చెప్పారు.

Big Twist: ప్రశాంత్ అని పేరు మార్చుకుని ఏపీలో 15 ఏళ్లుగా నివాసం.. యూపీలో అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిసి ఉలిక్కిపడ్డ జనం..!

Urination-Case.jpg

తర్వాత రావత్‌కు ప్రభుత్వం రూ.5లక్షల ఆర్థిక సాయంతో పాటూ ఇంటి నిర్మాణానికి రూ.1.50లక్షల సాయం కూడా మంజూరు చేసింది. అయితే ఈ కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ‘‘నిందితుడు చేసింది తప్పే.. అయితే తన తప్పును తాను తెలుకున్నాడు. అతను మా గ్రామానికి చెందిన పండిట్. ప్రస్తుతం మాకు అంతా అందగా నిలుస్తున్నారు. కొన్నాళ్లకు మమ్మల్ని మర్చిపోతారు. తర్వాత వాళ్లతో మాకేమైనా సమస్య ఎదురైతే దిక్కెవరు. మాకు ఎవరితో ఎలాంటి గొడవలూ వద్దు. ప్రవేశ్‌ను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. అలాగే మా ఊరికి రోడ్లు వేయాలని మాత్రం ఆవిస్తున్నా’’.. అని బాధితుడు రావత్ విన్నవించుకున్నాడు. మరోవైపు శుక్లా ఇంటిని కూల్చేయడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడి తప్పు చేస్తే అతడి కుటుంబానికి శిక్ష ఎందుకు వేశారని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

Viral: చెల్లి దిష్టిబొమ్మను పాడెపై పడుకోబెట్టి.. చనిపోయిందంటూ ఊరేగించి.. ఇంట్లోని దుస్తులన్నిటినీ తెచ్చి చితిగా పేర్చి..!

Updated Date - 2023-07-08T19:06:53+05:30 IST