Viral video: వ్యక్తి మెడలో గుట్టలు గుట్టలుగా పాములు.. అంతా చుట్టూ చేరి అదే పనిగా మీద వేస్తున్నా.. అతను మాత్రం..

ABN , First Publish Date - 2023-07-08T21:45:01+05:30 IST

పాములు చూడగానే కొందరు పరుగులు పెడితే.. మరికొందరు వాటితో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఇది ప్రమాదమని తెలిసినా చాలా మంది పాముల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా...

Viral video: వ్యక్తి మెడలో గుట్టలు గుట్టలుగా పాములు.. అంతా చుట్టూ చేరి అదే పనిగా మీద వేస్తున్నా.. అతను మాత్రం..

పాములు చూడగానే కొందరు పరుగులు పెడితే.. మరికొందరు వాటితో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఇది ప్రమాదమని తెలిసినా చాలా మంది పాముల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం పాములకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన మెడలో పదుల సంఖ్యలో పాములను వేసుకుని వచ్చాడు. మరోవైపు చుట్టూ ఉన్న వారంతా బలవంతంగా పాములను పట్టుకుని అతడి మెడలో వేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ యువకుడు తన మెడలో పదుల సంఖ్యలో పాములను (man hanging snakes around neck) వేసుకుని జన సమూహం వద్దకు వస్తాడు. అతన్ని చూసి అంతా షాక్ అవుతారు. సజీవంగా ఉన్న పాములను మెడలో వేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాటిలో చాలా పాములు అతడి ఒంటిపై పాకుతూ ఉంటే.. ఇంకొన్ని పాములు పైనుంచి జారి నేలపై పడుతూ ఉంటాయి. దీంతో అతడి పక్కన ఉన్న వారు.. కింద పడ్డ పాములను తీసుకుని మళ్లీ అతడి మెడలో వేస్తుంటారు.

Viral video: ఇది ఇంగ్లీష్ నేర్చిన కుక్క.. యజమాని పెట్టిన పరీక్షలో ఎలా నెగ్గిందో చూడండి..

అయినా అతను మాత్రం ఏమాత్రం భయం లేకుండా.. ‘‘నేనో బాబా.. ఈ పాములు నన్ను ఏమీ చేయవు’’.. అన్నట్లుగా నవ్వుతూ అందరికీ అభివాదం చేస్తూ ఉంటాడు. ఇలా అటూ ఇటూ తిరుగుతూ ప్రదర్శన ఇస్తుంటాడు. అయితే ఏ పామూ అతన్ని కాటు వేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడంటే పాములకు ఎంతో ఇష్టం ఉన్నట్లుంది’’.. అని కొందరు, ‘‘టైం బాగుండి సరిపోయింది’’.. అని ఇంకొందరు, ‘‘ఇలాంటి సాహసాలు చాలా ప్రమాదకరం’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral: చెల్లి దిష్టిబొమ్మను పాడెపై పడుకోబెట్టి.. చనిపోయిందంటూ ఊరేగించి.. ఇంట్లోని దుస్తులన్నిటినీ తెచ్చి చితిగా పేర్చి..!

Updated Date - 2023-07-08T21:45:01+05:30 IST