Share News

Crime News: ఇంటి ముందు మూత్రవిసర్జన చేసిందనే కోపంతో.. మహిళ అని చూడకుండా.. ప్రైవేట్ భాగాలపై..

ABN , Publish Date - Dec 17 , 2023 | 09:17 PM

ఎక్కడ చూసినా మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో కొందరు, ప్రేమించలేదని మరికొందరు, తమ దారికి రాలేదనే కోపంతో ఇంకొందరు వయసుతో సంబంధం లేకుండా మహిళలందరిపై దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా....

Crime News: ఇంటి ముందు మూత్రవిసర్జన చేసిందనే కోపంతో.. మహిళ అని చూడకుండా.. ప్రైవేట్ భాగాలపై..
ప్రతీకాత్మక చిత్రం

ఎక్కడ చూసినా మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో కొందరు, ప్రేమించలేదని మరికొందరు, తమ దారికి రాలేదనే కోపంతో ఇంకొందరు వయసుతో సంబంధం లేకుండా మహిళలందరిపై దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తమ ఇంటి ముందు మూత్రవిసర్జన చేసిందనే అనుమానంతో కొందరు ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) షాజహాన్‌పూర్‌లోని రామచంద్ర మిషన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 35 మహిళపై పొరుగింటి వారు దాడి చేశారు. ఇటీవల ఓ రోజు రాత్రి సదరు మహిళ (woman) పక్కింటికి సమీపంలోని కాలువలో మూత్రవిసర్జన (peeing) చేసిందని స్థానికులు ఆరోపించారు. ఈ విషయంలో ఆమెకు.. సదరు ఇంటి యజమానులకు గొడవ జరిగింది. మాటామాటా పెరిగి చివరికి పెద్ద గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు (Assault on woman) కలిసి బాధితురాలిపై దాడికి తెగబడ్డారు.

Viral Video: ఇంట్లోని కాలువలో ఈతకొడుతున్న బాలిక.. వంటింట్లోకి కాలువ ఎలా వచ్చిందని ఆరా తీయగా..

మహిళ ప్రైవేట్ భాగాలపై గట్టిగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తున్నామని, పూర్తి విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకారణంగా దాడి చేశారని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral Video: పనిలో ఏకాగ్రత అంటే ఇదేనేమో.. పాములు పక్కనే ఉన్నా పట్టించుకోకుండా..

Updated Date - Dec 17 , 2023 | 09:20 PM