Share News

Viral Video: ఇంట్లోని కాలువలో ఈతకొడుతున్న బాలిక.. వంటింట్లోకి కాలువ ఎలా వచ్చిందని ఆరా తీయగా..

ABN , Publish Date - Dec 17 , 2023 | 06:10 PM

చెరువులు, నదులు లేదా స్మిమ్మింగ్ పూల్స్‌లో ఈత కొట్టడం సర్వసాధారణం. అయితే ఇంట్లో ఈత కొట్టడం ఏంటీ.. అది కూడా వంటింట్లో కాలువ ఏంటని ఎవరికైనా సందేహం రావొచ్చు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ పాప ...

Viral Video: ఇంట్లోని కాలువలో ఈతకొడుతున్న బాలిక.. వంటింట్లోకి కాలువ ఎలా వచ్చిందని ఆరా తీయగా..

చెరువులు, నదులు లేదా స్మిమ్మింగ్ పూల్స్‌లో ఈత కొట్టడం సర్వసాధారణం. అయితే ఇంట్లో ఈత కొట్టడం ఏంటీ.. అది కూడా వంటింట్లో కాలువ ఏంటని ఎవరికైనా సందేహం రావొచ్చు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ పాప తమ వంటింట్లో ఉన్న కాలువలో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘వంటింట్లోకి కాలువ ఎలా వచ్చింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయంలోకి వెళితే..

సోషల్ మీడియాలో ఓ బాలిక వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు బాలికలు వంటింట్లో ఆడుకుంటూ ఉంటారు. అదే ఇంట్లో కాలువలో నీరు వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆడుకునే క్రమలో ఓ బాలిక.. కాలువ నీటిలో పడుకుని (girl swimming in kitchen drain) ఈత కొడుతుంది. నీటి వేగానికి కాలువ గుండా కొట్టుకుపోతుంది. అయితే కొద్ది దూరం వెళ్లా.. కాలువ పైన ఏర్పాటు చేసిన దిమ్మెను పట్టుకుని మళ్లీ వెనక్కు వస్తుంది. ఇలా ఆమె వంటింట్లో ఆడుకోవడంతో పాటూ ఈత కూడా కొడుతూ ఎంజాయ్ చేస్తుంటుంది. అయితే వంటింట్లోకి కాలువ ఎలా వచ్చిందని ఆరా తీయగా.. వంట పాత్రలు కడిగేందుకు పదే పదే బయటికి వెళ్లకుండా లోపలే కడిగేలా ఈ ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసింది.

Viral: బొద్దింకను చంపేందుకు వెంటపడి మరీ స్ప్రే కొట్టాడు... మరుక్షణమే ఎవరూ ఊహించని విధంగా..

వంటింటి పొడవునా ఏర్పాటు చేసిన కాలువలో.. కుటుంబ సభ్యులు కూరగాయలు కడగడం, పాత్రలు శుభ్రం చేసుకోవడం కూడా వీడియోల్లో చూడొచ్చు. వంట గదికి అటు వైపు నుంచి ఇటు వైపు ఇంటి బయట వరకూ కాలువను ఏర్పాటు చేశారు. లోపలికి వచ్చే నీళ్లన్నీ ఇంటి బయట ఉన్న మొక్కల వద్దకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఐడియా ఐదుర్స్’’.. అంటూ కొందరు, ‘‘వంటింట్లో స్మిమ్మింగ్ పూల్.. సూపర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పనిలో ఏకాగ్రత అంటే ఇదేనేమో.. పాములు పక్కనే ఉన్నా పట్టించుకోకుండా..

Updated Date - Dec 17 , 2023 | 06:10 PM