Share News

Viral: బొద్దింకను చంపేందుకు వెంటపడి మరీ స్ప్రే కొట్టాడు... మరుక్షణమే ఎవరూ ఊహించని విధంగా..

ABN , Publish Date - Dec 16 , 2023 | 09:47 PM

కొందరు అవగాహన లేకుండా చేసే పనులు చివరకు చాలా సీరియస్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొందరు ఏదో చేయబోతే చివరికి ఇంకేదో జరుగుతుంటుంది. ఇలాంటి పనులు కొన్నిసార్లు ప్రాణాల మీదకు వచ్చిపడుతుంటాయి. తాజాగా....

Viral: బొద్దింకను చంపేందుకు వెంటపడి మరీ స్ప్రే కొట్టాడు... మరుక్షణమే ఎవరూ ఊహించని విధంగా..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు అవగాహన లేకుండా చేసే పనులు చివరకు చాలా సీరియస్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొందరు ఏదో చేయబోతే చివరికి ఇంకేదో జరుగుతుంటుంది. ఇలాంటి పనులు కొన్నిసార్లు ప్రాణాల మీదకు వచ్చిపడుతుంటాయి. తాజాగా, జపాన్‌లో ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఒకే ఒక్క బొద్దింకను చంపేందుకు వెంటపడీ మరీ స్ప్రే కొట్టాడు. చివరకు ఏం జరిగిందంటే..

జపాన్ (Japan) కుమామోటోలోని చువో వార్డ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 54 ఏళ్ల ఓ వ్యక్తి తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో చాలా రోజులుగా బొద్దింకల (cockroaches) బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో వాటి నివారణకు చాలా ప్రయత్నాలు చేశాడు. అయినా బొద్దింకల బెడద ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో ఇటీవల కొత్తగా బొద్దింకల స్ప్రే తీసుకున్నాడు. ఓ బొద్దింకపై స్ప్రే చేసి టెస్ట్ చేయాలని అనుకున్నాడు. ఇలా ఓ బొద్దింకను టార్గెట్ చేసి, వెంటబడి (Cockroach spray) మరీ స్ప్రే కొట్టాడు.

Viral Video: ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ.. మరోవైపు స్మార్ట్ ఫోన్‌తో ఇతను చేస్తున్న పని చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ఈ క్రమంలో ఎలక్ట్రిక్ పరికాలు ఉన్న ప్రాంతంలో స్ప్రే చేయడంతో ఒక్కసారిగా పేలుడు జరిగి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో అతడి స్వల్ప గాయాలవడంతో పాటూ అతడి ఇంటి కిటికీ కూడా దెబ్బతింది. ఎలక్ట్రిక్ వస్తువులు ఉన్న ప్రాంతంలో లిక్విడ్ స్ప్రేలు చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయని నిపుణులు తెలిపారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఇంతకీ బొద్దింక చనిపోయిందా.. లేదా’’.. అంటూ కొందరు, ‘‘బొద్దింకలు కూడా రోజురోజుకూ అప్‌డేట్ అవుతుంటాయి’’.. అంటూ ఇంకొందరు, ‘‘కొన్ని రకాల లిక్విడ్ స్ప్రేలు చాలా ప్రమాదకరం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Photo: మాజీ ప్రియురాలు చేసిన పనికి ఖంగుతిన్న ప్రియుడు.. ఒకే ఒక్క టెక్నిక్‌తో ఎలా రివేంజ్ తీర్చుకుందంటే..

Updated Date - Dec 16 , 2023 | 09:47 PM