Share News

Viral Video: పనిలో ఏకాగ్రత అంటే ఇదేనేమో.. పాములు పక్కనే ఉన్నా పట్టించుకోకుండా..

ABN , Publish Date - Dec 17 , 2023 | 04:04 PM

కొందరు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైతే చాలు.. చేస్తున్న పనిని కూడా పక్కన పెట్టేస్తుంటారు. మరికొందరు ఎన్ని సమస్యలొచ్చినా ఎదుర్కొంటూ చివరకు అనుకున్న పనిని పూర్తి చేస్తుంటారు. ఇలాంటి...

Viral Video: పనిలో ఏకాగ్రత అంటే ఇదేనేమో.. పాములు పక్కనే ఉన్నా పట్టించుకోకుండా..

కొందరు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైతే చాలు.. చేస్తున్న పనిని కూడా పక్కన పెట్టేస్తుంటారు. మరికొందరు ఎన్ని సమస్యలొచ్చినా ఎదుర్కొంటూ చివరకు అనుకున్న పనిని పూర్తి చేస్తుంటారు. ఇలాంటి వ్యక్తలుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పక్కనే రెండు పాములు ఉన్నా కూడా పట్టించుకోకుండా.. ఓ వ్యక్తి గోల్ఫ్ ఆడడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘‘పనిలో ఏకాగ్రత అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలోని (Australia) బ్రిస్బేన్‌లోని గోల్ఫ్ కోర్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గోల్ఫ్ ఆడుతుండగా.. అక్కడికి రెండు పాములు వస్తాయి. పెనవేసుకున్న రెండు పాములు.. కాసేపటికి గోల్ఫ్ ఆడుతున్న వ్యక్తి (man playing golf) సమీపానికి వెళ్తాయి. అయినా ఆ వ్యక్తి మాత్రం అదేమీ పట్టించుకోకుండా గోల్ఫ్ ఆడుతుంటాడు.

Viral Video: పారాగ్లైడింగ్ చేస్తున్న యువకుడిని చూసి అవాక్కవుతున్న నెటిజన్లు.. ఇంతకీ అతను ఏం చేశాడో మీరే చూడండి..

పాములను ఏమాత్రం పట్టించుకోకుండా బంతిని లక్ష్యం దిశగా కొట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. పాములు చాలా సేపు అక్కడే ఉన్నా అతను భయపడకుండా గోల్ఫ్ ఆడుకుంటూ ఉంటాడు. ఆస్ట్రేలియాలో పాములు ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ దేశంలో 140 కంటే ఎక్కువ జాతుల పాములు ఉన్నాయని ఓ అంచనా. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పనిలో ఏకాగ్రత అంటే ఇలాగే ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘కాస్త ముందూ వెనుకా చూసుకో బ్రదర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Photo: మాజీ ప్రియురాలు చేసిన పనికి ఖంగుతిన్న ప్రియుడు.. ఒకే ఒక్క టెక్నిక్‌తో ఎలా రివేంజ్ తీర్చుకుందంటే..

Updated Date - Dec 17 , 2023 | 04:04 PM