Skin Care: ముఖానికి క్రీమ్స్ వాడుతున్నారా..? రాసుకోగానే ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పారేసేయండి..!

ABN , First Publish Date - 2023-08-22T16:08:55+05:30 IST

ప్రస్తుతం యువతీయువకులంతా చర్మ సౌందర్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. యువతులతో పోటిపడి మరీ యువకులు కూడా వివిధ రకాల ఫేస్ క్రీమ్‌లను వాడడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేకునే అవకాశం ఉండడంతో మారుమూల ప్రాంతాల్లో ఉండే వారు సైతం తమకు నచ్చిన ప్రొడక్ట్స్‌ను ఆర్డర్ చేసేస్తుంటారు. అయితే..

Skin Care: ముఖానికి క్రీమ్స్ వాడుతున్నారా..? రాసుకోగానే ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పారేసేయండి..!

ప్రస్తుతం యువతీయువకులంతా చర్మ సౌందర్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. యువతులతో పోటిపడి మరీ యువకులు కూడా వివిధ రకాల ఫేస్ క్రీమ్‌లను వాడడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేకునే అవకాశం ఉండడంతో మారుమూల ప్రాంతాల్లో ఉండే వారు సైతం తమకు నచ్చిన ప్రొడక్ట్స్‌ను ఆర్డర్ చేసేస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో చాలా మంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఏ క్రీమ్స్ పడితే వాటిని వాడుతుంటారు. ముఖానికి రాసుకునే క్రీమ్స్ విషయంలో అవగాహన ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వాటిని వాడటం మానేయాలని హెచ్చరిస్తున్నారు. అసలు క్రీమ్స్ ట్యూబులను ఓపెన్ చేశాక.. ఎన్ని నెలల పాటు వాటిని వాడొచ్చు.. తదితర సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చర్మ సౌందర్య సాధానాలను (Skin care products) వాడే విషయంలో చాలా మంది గుడ్డిగా ఫాలో అవుతుంటారు. ఫలానా క్రీమ్ అనేది లేకుండా ఏది పడితే అది వాడుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల చర్మానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల ఉత్పత్తులు.. చర్మ సంరక్షణకు సాయపడతాయి. అయితే వాటి గడువు తేదీ తదితర విషయాలను ప్రధానంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వాటి నాణ్యత తగ్గుతూ వస్తున్నా.. లేదా ఏదైనా విచిత్రమైన వాసన వస్తున్నా.. అది వినియోగించడానికి పనికిరాదని అర్థం చేసుకోవాలి.

beauty-produts.jpg

ఫేస్ వాష్‌ క్రీమ్‌కు (face wash creams) సాధారణంగా 1నుంచి రెండేళ్ల వరకు కాల పరిమితి ఉంటంది. అలాగే మాయిశ్చరైజర్‌కు 1నుంచి మూడేళ్ల వరకు, సన్‌స్ర్కీన్ లోషన్‌కు 1 నుంచి రెండేళ్ల వరకు, టోనర్‌కు 6 నెలల నుంచి ఏడాది వరకు, సీరంకు సాధారణంగా 6 నెలల నుంచి ఏడాది వరకు, ఎక్స్‌ఫోలియేటర్‌ను 6నెలల నుంచి ఏడాది లోపు మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్కువమంది వివిధ రకాల ప్రొడక్ట్స్‌ని వాడుతుంటారు. కానీ వాటి షెల్ప్ లైఫ్ గురించి, ఎక్స్‌పైరీ డేట్ తదితర వివరాల గురించి పట్టించుకోరు. కొన్నింటికి ఎక్స్‌పైరీ డేట్ ఉండకపోవడంతో ఇష్టమొచ్చినంత కాలం వాడేస్తుంటారు. అసలు ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని నెలల పాటూ వాడాలన్ని విషయానికొస్తే.. రెటినోల్‌ను ఓపెన్ చేసిన 2నుంచి 3 నెలల వరకు వాడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే మిటమిన్-సి సీరంను తెరచిన తర్వాత 3నెలల వరకూ వాడొచ్చు. అదేవిధంగా బెంజాయిల్ పెరాక్సైడ్‌ను ఓపెన్ చేసిన తర్వాత 3 నెలల వరకూ వాడొచ్చు.

women-skin-care.jpg

బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఎక్స్‌పైరీ డేట్ అయిపోయాక అస్సలు వాడకూడదు. కొన్ని ఎక్స్‌పైరీ డేట్ అవ్వక ముందే రంగు మారడం, వాసన వస్తుంటుంది. అలాంటి వాటిని కూడా వాడకూడదు. అలాగే దేన్ని వాడినా చర్మానికి అప్లై చేసే ముందు చేతులు బాగా కడుక్కోవాలి. చేతులు శుభ్రంగా ఉండడం వల్ల చర్మానికి హాని కలగదు. అలాగే వాడే ముందు బాటిల్‌‌ను బాగా షేక్ చేయాలి. వాడిన అనంతరం వాటిని పొడి ప్రదేశంలో స్టోర్ చేయాలి. ప్రతి ప్రొడక్ట్‌ను ఎలా వాడాలి అనే వివరాలను అందులోనే సూచిస్తారు. దాన్ని అనుసరించి వినియోగించాల్సి ఉంటుంది. కొత్త కొత్త ప్రొడక్ట్స్‌ను వాడినప్పుడు ఏదైనా దురద, చర్మం రంగుమారడం, అసౌకర్యంగా అనిపిస్తే.. వెంటనే వాటిని చెత్త బుట్టలో పడేయండి. సమస్య ఎక్కుగా ఉంటే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకోవడం ఉత్తమం. చర్మ సౌందర్య సాధనాల విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కీడు జరగకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Bride Stunts: బాబోయ్.. ఇవేం స్టంట్స్..? వరుడి మెడకు కాలును చుట్టి.. మరో కాలుని తొడపై పెట్టి.. ఓ వధువు వింత విన్యాసాలు..

Updated Date - 2023-08-22T16:15:55+05:30 IST