Viral Video: రాత్రి వేళ మనుషులు లేకుండానే నడుస్తున్న వాహనాలు.. దయ్యాలే అని అంతా భయపడ్డారు.. చివరకు ఊహించని ట్విస్ట్..

ABN , First Publish Date - 2023-08-20T17:32:50+05:30 IST

దయ్యాలు ఉన్నాయా.. లేవా..? అనే విషయం పక్కన పెడితే.. ఈ పేరుతో ఎంతో మంది వివిధ రకాలుగా సొమ్ము చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. దయ్యాల పేరుతో ఎన్ని సినిమాలు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉండడంతో..

Viral Video: రాత్రి వేళ మనుషులు లేకుండానే నడుస్తున్న వాహనాలు.. దయ్యాలే అని అంతా భయపడ్డారు.. చివరకు ఊహించని ట్విస్ట్..

దయ్యాలు ఉన్నాయా.. లేవా..? అనే విషయం పక్కన పెడితే.. ఈ పేరుతో ఎంతో మంది వివిధ రకాలుగా సొమ్ము చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. దయ్యాల పేరుతో ఎన్ని సినిమాలు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉండడంతో పలువురు ఇలాంటి వీడియోలు చేసి లక్షలు సంపాదిస్తున్నారు. తాజాగా, నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రాత్రి వేళ మనుషులు లేకుండానే వాహనాలు నడుస్తున్నాయని, అది దయ్యాల పనే అని అంతా భయాందోళన చెందారు. అయితే చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral video) అవుతోంది. ఇండోనేషియా (Indonesia) టుబాన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతంలో రాత్రి వేళ గుర్రపు బండి ఆకారంలో ఉన్న వాహనం రోడ్డుపై దూసుకెళ్తూ ఉంది. ఆ బండి వెనుకే ఇంకో వాహనంలో వెళ్తున్న వారు.. ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. బండిని ఫాలో అవుతూ వెళ్లిన వారు.. ముందు వైపు చూడగా ఎవరూ లేరు. దీంతో ఆ బండిని నడుపుతున్నది దయ్యమే (Devil) అని అనుకున్నారు. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ అవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

NRI Doctor: క్రైమ్ థ్రిల్లర్‌ను మించిన ట్విస్టులు.. ఆ ఆస్పత్రిలో వరుసగా ఏడుగురు పిల్లల మృతి.. ఈ డాక్టర్‌కు వచ్చిన డౌట్‌తో..!

రాత్రి వేళ దయ్యాలు వాహనాల్లో తిరుగున్నాయంటూ పుకార్లు వెల్లువెత్తడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ జనం ఆసక్తిగా చర్చించుకోవడం మొదలెట్టారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి ఆరా తీశారు. విచారణలో ఇదంతా ప్రజల్ని భయపెట్టడానికి కొందరు కావాలని చేసిన పని అని తెలిసింది. ఎద్దుల బండికి తాడు కట్టి కొందరు ముంద వైపు లాగుతూ వెళ్లడం వల్ల అలా కనిపించిందని, ప్రజల్ని నమ్మించడానికి వీడియో తీసి వైరల్ చేశారని తేలింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిచంగా.. ఈ పని తామే చేశామని, తమని క్షమించమంటూ వేడుకున్నారు. ఇలాంటి వదంతులు నమ్మొద్దంటూ పోలీసులు శుక్రవారం ప్రజలకు సూచించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఇదెక్కడి పైత్యంరా నాయనా.. ఈ ఐస్‌క్రీమ్ తింటే టిఫిన్ అక్కర్లేదంట.. ఇంతకీ ఎలా చేశాడో మీరే చూడండి..

Updated Date - 2023-08-20T17:32:50+05:30 IST