Viral Video: ఇదెక్కడి పైత్యంరా నాయనా.. ఈ ఐస్‌క్రీమ్ తింటే టిఫిన్ అక్కర్లేదంట.. ఇంతకీ ఎలా చేశాడో మీరే చూడండి..

ABN , First Publish Date - 2023-08-20T16:00:06+05:30 IST

ఈ రోజుల్లో ఫుడ్ లవర్స్ పైత్యానికి హద్దూ అదుపు లేకుండా పోతోంది. అలాగే కస్టమర్లను ఆకట్టుకునేందుకు వ్యాపారులు కూడా చిత్రవిచిత్రమైన రెసిపీలతో ఫుడ్‌ను ప్రిపేర్ చేస్తున్నారు. ప్రస్తుతం సమాజంపై సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపిస్తుండడంతో చాలా మంది తమ వినూత్న ఆలోచనలను...

Viral Video: ఇదెక్కడి పైత్యంరా నాయనా.. ఈ ఐస్‌క్రీమ్ తింటే టిఫిన్ అక్కర్లేదంట.. ఇంతకీ ఎలా చేశాడో మీరే చూడండి..

ఈ రోజుల్లో ఫుడ్ లవర్స్ పైత్యానికి హద్దూ అదుపు లేకుండా పోతోంది. అలాగే కస్టమర్లను ఆకట్టుకునేందుకు వ్యాపారులు కూడా చిత్రవిచిత్రమైన రెసిపీలతో ఫుడ్‌ను ప్రిపేర్ చేస్తున్నారు. ప్రస్తుతం సమాజంపై సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపిస్తుండడంతో చాలా మంది తమ వినూత్న ఆలోచనలను వీడియోలుగా మార్చి నెట్టింట్లోకి వదులుతున్నారు. ప్రస్తుతం ఓ ఐస్‌క్రీమ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇదెక్కడి పైత్యంరా నాయనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ ఐస్‌క్రీమ్‌ను ఎలా తయారు చేశాడో మీరే చూడండి..

సోషల్ మీడియాలో (Viral video) ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ చిరు వ్యాపారికి విచిత్రమైన ఆలోచన వచ్చింది. దోశ (dosa) వేసే అతను కొత్తరకం వంటకం కోసం ఏకంగా ఐస్‌క్రీమ్‌ను (Ice cream) ఎంచుకున్నాడు. ఇందుకోసం ముందుగా పెనంపై దోశ పిండిని వేసి పలుచగా పరుస్తాడు. తర్వాత దానిపై చాకొలెట్ క్రీమ్ (Chocolate cream) పూస్తాడు. దోశ ఎర్రగా మారిన తర్వాత దాన్ని సగానికి కట్ చేసి, గుండ్రంగా ఐస్‌క్రీమ్ కోన్ తరహాలో చుడతాడు. అనంతం అందులో అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ఐస్ క్రీమ్‪‌ను నింపుతాడు.

Viral: అంతా చూస్తుండగానే.. కాలికి వేసుకున్న చెప్పులను తీసి.. ఓ యువకుడి చెంపలు వాయించిన యువతి.. అసలేం జరిగిందంటే..!

చివరగా దానిపై తురిమిన చాక్లెట్ ముక్కలను చల్లుతాడు. ఫైనల్‌గా అందమైన నోరూరించే ఐస్ క్రీమ్‪‌ను సిద్ధం చేస్తాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు (Funny comments) చేస్తున్నారు. ‘‘ఇదెక్కడి పైత్యంరా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘దోశను గుర్తుపట్టలేని విధంగా మార్చావు కదరా’’.. అంటూ మరికొందరు, ‘‘ఎలా వస్తాయిరా.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ ఇంకొందరు, ‘‘నిజంగా.. ఇది దోశను హత్య చేయడమే’’.. అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

UPI Transactions: పర్సుల్లోంచి డబ్బులు తీయడం లేదా..? షాపుల్లో స్కాన్ చేసే ముందు వీటిని చెక్ చేసుకోకపోతే..!

Updated Date - 2023-08-20T16:00:06+05:30 IST